728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 5, 2023

చిలకలూరిపేట లో తొమ్మిదో తేదీ పుర ప్రజలకు మంచినీళ్లు రావు


చిలకలూరిపేట పట్టణ పరిధిలో జాతీయ రహదారి ఆనుకుని నేషనల్ హైవే ప్రాజెక్టు వారు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు భాగంగా చిలకలూరిపేట పురపాలక సంఘానికి చెందిన పైప్ లైన్లు నిర్మాణానికి అడ్డంగా ఉన్నందున ఆ పైప్ లైన్లు బైపాస్ చేయడానికి తొమ్మిదవ తేదీన పనులు జరుపుతారని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, చైర్మన్ రఫానీ తెలియజేశారు. తొమ్మిదో తేదీ నేషనల్ హైవే ప్రాజెక్టు వారు మంచినీటి పైపులు బైపాస్ చేసేందుకుగాను చిలకలూరిపేట పట్టణానికి మంచినీటి చెరువు ద్వారా వచ్చే నీరు రాదని 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు చిలకలూరిపేట పుర ప్రజలకు మంచినీరు అందించలేమని వారు తెలిపారు.  అందువలన 9వ తేదీ ఉదయం వరకు మంచినీళ్లు పట్టుకొని 9 ,10వ తేదీ వాడుకోవాలని నేషనల్ హైవే పనుల కారణంగా 24 గంటలు పుర ప్రజలకు మంచినీళ్లు అందించలేకపోతున్నామని మున్సిపల్ చైర్మన్ రఫానీ, కమిషనర్ గోవిందరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. సమావేశంలోవైస్  చైర్మన్ వెంకటేశ్వరరావు,, డి రమణ ఏఈ, కౌన్సిలర్ జాలాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో తొమ్మిదో తేదీ పుర ప్రజలకు మంచినీళ్లు రావు Rating: 5 Reviewed By: NEWS UPDATE