చిలకలూరిపేట పట్టణంలోని నర్సారావుపేట సెంటర్లో స్కూటీ పై వెళుతూ జారీ కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న శనివారపు సాంబశివరావు స్కూటీపై నర్సారావుపేట సెంటర్ వైపు వెళుతుండగా స్కూటీ జారి కింద పడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 సిబ్బంది శోభన్ బాబు, రాములు ప్రాథమిక చికిత్స చేసి ఇతనిని చిలకలూరిపేటలోని ఒక ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
February 4, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట మున్సిపల్ కాంట్రాక్టర్ కు తీవ్ర గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

