నవజాత శిశువులకు సంజీవని గా వరలక్ష్మి సంతాన సాఫల్య కేంద్రం
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే కాక, విజయవాడ నుంచి వైద్యం కోసం రాక
అమ్మదనం లోని కమ్మదనాన్ని చవి చూపిస్తున్న మాతృమూర్తులు
తాజాగా 45 సంవత్సరాల వయసులో శిశువుకు జన్మనిచ్చిన మహిళ
చిలకలూరిపేట:
చిలకలూరిపేట ఉన్న వరలక్ష్మీ సంతాన సాఫల్యకేంద్రం అతి తక్కువ ఖర్చుతోనే, ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారికి , అమ్మదనం లోని కమ్మదనాన్ని చవి చూపిస్తుంది. గతంలో ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే అన్ని రకాల వైద్య పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారని గుంటూరు, విజయవాడలాంటి నగరాలకు వెళ్లడం చూస్తుంటాం. కాని ఆ నగరాలకు వెళ్లకుండానే పిల్లలు కలగని దంపతులు చిలకలూరిపేటలోని వరలక్ష్మీ సంతాన సాఫల్యకేంద్రం ఆశ్రయించటం ప్రస్తుతం జరుగుతున్న పరిణామం. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకవైపు సంతాన సాఫల్యాన్ని అందజేస్తునే... హైరిస్కు కాన్పుల విషయంలోనూ, బరువుతక్కువగా పెట్టిన శిశువుల విషయంలోనూ తీసుకుంటున్న శ్రద్ద, వారు అందిస్తున్న భరోసా తల్లిదంద్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది.
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వైనం...
ప్రస్తుత కాలంలో సంతానలేమి సమస్య అనేకంగా వేధిస్తోంది. సంతానం లేక ఎందరో మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కొందరికి సంతానం కలగదు. సాధారణంగా వివాహమైన దంపతులకు పిల్లలు కలగపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. దంపతులకు పిల్లలు కలగపోవటానికి అంటే సంతాన లేమికి ఆడవారు, మగవారు లేదా ఇద్దరూ కారణం కావచ్చు. ముఖ్యంగా మహిళల విషయంలో స్త్రీ ప్రత్యుత్తి వ్యవస్థలో లోపాలు, చిన్న గర్భసంచి ఉండటం, గర్భసంచి లేకపోవడం, రెండు గదులుగా ఉండే గర్భసంచి, ట్యూబ్స్ మూసుకుపోవటం, అండాశయంలో సరైన ఎదుగుదల లేకపోవటం, ఆ మార్గం చిన్నగా ఉండటం, మూసుకుపోయినట్లు ఉండటం, హార్మోన్ సమస్యలు కారణం కావచ్చు. అలాగే రుతుక్రమం సరిగ్గా కాలేకపోవడం సంతానలేమికి దారితీయవచ్చు. గర్భసంచిలో కణతులు ఏర్పడి ఫాలోపియన్ ట్యూబ్స్‌కు అడ్డు తగలడం, ఫలదీకరణం చెందిన పిండం గర్భసంచిలో స్థావరం ఏర్పడకుండా చేయడం వల్ల సంతానలేమికి దారితీస్తుంది. ఇవేవి కాకుండా ఆరోగ్యవంతులకు కూడా ఆకారణంగా పిల్లలు కలగక పోవటాన్ని ఇడియోపతిక్ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇలాంటి సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు వారి సమస్యకు సరైన పరిష్కారం కూడా వరలక్ష్మి ఆసుపత్రి సిబ్బంది కనిపెడతారు. ఇలా అనేక అసాధ్యాలను సుసాధ్యం చేయడం వీరి ప్రత్యేకత. తాజాగా ఈ ఆసుప్రతిలో జరిగిన ప్రసవం గమనిస్తే ఆసుపత్రి సక్సెస్ రేటు ఎందుకు పెరుగుతుందో గమనించవచ్చు.
45 సంవత్సారాల వయసులో మాతృత్వం..
45సంవత్సరాల వయసులో ఓ మహిళ మాతృత్వ చిరకాల వాంఛను ఈ ఆసుపత్రి వైద్యులు సుసాధ్యం చేసారు. 45 సంవత్సరాల వయసు ఉన్న విజయవాడకు చెందిన షేక్ మస్తాన్‌బి అనే మహిళ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. తనకు 20 సంవత్సరాల నుంచి బీపీ, 15 సంవత్సరాల నుంచి షుగర్ కూడా ఉన్నట్లు వివరించారు. ఆమె కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న వైద్యులు ఆమె వైద్యచరిత్రను అధ్యయం చేశారు. వైద్యుల ఆధ్వర్యంలో ఈ నెల 7 తేదీవ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఇద్దరు కూడా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. తన జీవిత వాంఛ నెరవేరిందని ఆ మహిళ వరలక్ష్మి వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.
వరలక్ష్మీ సంతాన సాఫల్యకేంద్రంలో దంపతులకు మాతృత్వ మధురిమను అందించటమే కాదు .. రెండు సంవత్సరాల కాలంలో 30 మంది హైరిస్కు శిశువులకు ప్రాణదాతగా ఆసుపత్రి వైద్యులు నిలిచారు. ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాల కాలంలో 24 హైరిస్కు కాన్పుల ద్వారా కేజీ, కేజీన్నర బరువు ఉన్న శిశువుల సంరక్షణ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పాటు కేవలం 600 నుంచి 750 గ్రాముల బరువుతో పుట్టిన 6గురు శిశువులకు ప్రాణదాతగా నిలిచారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలతోనే మాతృత్వాన్ని అందించటమే కాక, బరువు తక్కువ గా పుట్టిన పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రాణదాతలుగా నిలుస్తున్న వరలక్ష్మి సంతాన సాఫల్య కేంద్ర వైద్యుల కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

