చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గత కొద్ది నెలల నుండి ఇరు పార్టీల కౌన్సిలర్లు గళ మెత్తినా పట్టించుకోని సంబంధిత మున్సిపల్ అధికారులని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని మానుకొండ వారి పాలెం లో సాయంత్రం సమయంలో ఒకచోట కూర్చుని ఉన్న నలుగురిని కుక్కలు వచ్చి కరిచాయి. అనంతరం చుట్టుపక్కల ఉన్న పది గేదలను కరిచింది. ఆ నలుగురు వ్యక్తులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అతను వేరే ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించి చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం మంగళవారం వైసీపీ కౌన్సిలర్ మౌలాలి కుక్కలను అదుపు చేయండి అని చెప్పి తన గళం విప్పిన గాని అది తమ బాధ్యత కాదని ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం ఆపరేషన్ చేయాలని కుంటి సాకులు చెబుతూ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై చిలకలూరిపేట పట్టణంలోని కౌన్సిలర్లు అందరూ తమ నిరసన గళం విప్పిన గాని సంబంధిత అధికారులు పట్టి పట్టినట్లు ఉంటంపై ప్రజలు సర్వత్ర విమర్శిస్తున్నారు.
చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో కుక్కలు బాబాయ్ కుక్కలు... నలుగురిని, గేదెలను కరిచిన కుక్కలు ....ఒకరి పరిస్థితి విషమం