728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 1, 2023

చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుంది...!? నిబంధనలకు విరుద్ధంగా స్టాంప్ వెండార్లు, డాక్యుమెంట్ రైటర్లు


చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొద్దిరోజుల నుండి ఒంగోలుకు చెందిన సిట్ అధికారులు కార్యాలయంలో తమకు  కావాల్సిన సమాచారాన్ని రాబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది.  ఈ కోవలో చిలకలూరిపేట  శాఖ అధికారి సెలవులోకి వెళ్లినట్లు కూడా తెలియ వచ్చింది. చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద స్టాంప్ వెండర్ ల వద్ద  ఈ స్టాంపులు ఉన్నా కానీ కొంతమంది వెన్డర్లు ఈ స్టాంపులు కాకుండా నిబంధనలకు  విరుద్ధంగా అడ్రస్ ఒకచోట ఉండి చిలకలూరిపేట రిజిస్టర్ ఆఫీస్ వద్దనే స్టాంపులు అమ్మటం తదితర నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. 

చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 200 మీటర్ల దూరం నుంచే స్టాంప్ వెండర్లు  స్టాంపులు అమ్మాల్సిన నిబంధన ఉంది. అయితే  ముగ్గురు వ్యక్తులు తమ  పేరున ఈ స్టాంప్ లైసెన్సులు తీసుకుని వేరే వ్యక్తుల ద్వారా ఈ స్టాంప్ పేపర్లు అమ్మటంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.  

అదిను గాక సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు రాకూడదని ప్రభుత్వం గతంలో అనేక సార్లు చెప్పిన డాక్యుమెంట్ రైటర్లు యదేచ్చగా రావటం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం 0.5 కమిషన్ పేరు చెప్పి ముక్కుపిండి మరి రిజిస్ట్రేషన్కు వచ్చే వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయటంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.  సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి ఎందుకు ఊరుకుంటున్నారు అనేది కూడా చర్చగా మారింది. ఈ పై విషయాలన్నీ సదరు శాఖ అధికారికి తెలియదా.... తెలిసి ఎందుకు ఊరుకుంటున్నారు అనేదానిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ విషయాలపై మీడియా అడిగితే నాకు సంబంధం లేదు జిల్లా అధికారులను  అడగండని మొహం చాటేస్తున్నారు ఆ అధికారి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుంది...!? నిబంధనలకు విరుద్ధంగా స్టాంప్ వెండార్లు, డాక్యుమెంట్ రైటర్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE