728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 30, 2023

చిలకలూరిపేటకు తాకిన ఒంగోలు నకిలీ స్టాంపు దస్తావేజుల కుంభకోణం.. చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిట్ పోలీసులు

 ప్రకాశం జిల్లా ఒంగోలు నకిలీ స్టాంపులు, దస్తావేజులు కుంభకోణం కేసు చిలకలూరిపేటకు తాకింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో కొందరు వ్యక్తులు నకిలీ స్టాంపుల ద్వారా నకిలీ దస్తావేజులు తయారుచేసి వివాదంలో ఉన్న మరియు వీలునామాలు ద్వారా పొందిన ఆస్తులకు నకిలీ దస్తావేజులు తయారు చేయిస్తారు.  డెత్ సర్టిఫికెట్లు, జిపిఏలు రెవిన్యూ అధికారుల ద్వారా ప్రాపర్ పర్సన్ సర్టిఫికెట్లు పొందుతారు. ఈ పొందిన డాక్యుమెంట్ల ద్వారా ఖాళీ నకిలీ స్టాంప్ పేపర్ల మీద రిజిస్ట్రార్  కార్యాలయ అధికారులు వేసేముద్రలు స్టాంపులు తయారు చేసి  రిజిస్టర్ ఆఫీస్ లో వేసిన నంబర్ను వేసి ఒరిజినల్ స్టాంప్ పేపర్ లాగా తయారుచేస్తారు. నకిలీ దస్తావేజులు ద్వారా భూములను ఇతరులకు  అమ్ముతూ ఉంటారు.


ఈ విషయంపై అక్టోబర్ మొదటి వారంలో ఒంగోలు జిల్లా ఎస్పీకు పలు కేసులు అందాయి..22 మంది తమ ఆస్తులను ఆక్రమించుకున్నారని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదు చేయగా 19 మందిపై  కేసులు నమోదయ్యాయి. మొత్తము మ్మీద ఈ కేసుల్లో ఒంగోలు పోలీసులు ద్వారా  పూర్తి దర్యాప్తులో తేల్చగా సుమారు 500 స్టాంప్ పేపర్ల పత్రాలు, 123 డాక్యుమెంట్లు ఉన్నట్లు ఈనెల 16వ తారీఖున ఒంగోలు పోలీసులు(సిట్) మీడియా సమావేశంలో వెల్లడించారు. 


అయితే ప్రధాన సూత్రధారైన పూర్ణచంద్రావుకు చిలకలూరిపేటకు చెందిన దార్ల వంశి అనే వ్యక్తి  గుంటూరు చిలకలూరిపేట నుండి 20, 50, 100 స్టాంప్  పేపర్లను, ఈ స్టాంప్ పేపర్లను తీసుకొచ్చి ఇస్తున్నట్లు తేలింది. ఈ కేసులో ప్రకాశం పోలీస్ అధికారులు సిట్ దర్యాప్తును వేయటంతో సీట్ అధికారులు ఈనెల 27వ తేదీ శుక్రవారం చిలకలూరిపేట లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వచ్చి డాక్యుమెంట్లు మొత్తాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. అదే రోజు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు పాత తారీకులు వేసి డాక్యుమెంట్లు అమ్ముతున్న విషయం కూడా తెలుసుకొని వారి మీద కూడా నిఘా  ఏర్పాటు చేశారు. 


శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సిట్ పోలీసులు దార్ల వంశీ మరియు వంశీ బంధువైన మరొక మహిళ కోసం గాలించగా వారిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలియడంతో  అధికారులు వెళ్లిపోయారు. వందల కోట్ల రూపాయల కుంభకోణంలో చిలకలూరిపేట చెందిన ఇరువురు వ్యక్తుల పాత్ర వుంది. చిలకలూరిపేట  సబ్ రిజిస్టర్ కార్యాలయంలో  సిట్ పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ గతంలో నకిలీ స్టాంపులు కుంభకోణంలో చిలకలూరిపేట పురుషోత్తపట్నం చెందిన ఒక వ్యక్తి ప్రధాన సూత్రధారి కాగా.... ఒంగోలు నకిలీ స్టాంపులు నకిలీ దస్తావేజుల స్టాంపు కుంభకోణంలో చిలకలూరిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు సహకరించటం పూర్తి చర్చనీయాంసం అయింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటకు తాకిన ఒంగోలు నకిలీ స్టాంపు దస్తావేజుల కుంభకోణం.. చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిట్ పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE