చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 107 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సిఐ పి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ముద్దాయిలు గంజాయిని హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గంజాయి రవాణా చేస్తున్న చింతలపూడి శివకుమార్ హైదరాబాదు, కిముడు శంకర్ దుప్పల వాడ, వారిని అరెస్టు చేసినట్లు ఈ కేసులో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రూరల్ సీఐ పి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. వీరి వద్దనుండి 107 కేజీల గంజాయి విలువ సుమారు పది లక్షల రూపాయలు వుంటుంది. వీరి వద్ద నుంచి రెండు మోటార్సైకిలను స్వాధీన పరుచుకున్నట్లు మీడియాకు రూరల్ సీఐ తెలియజేశారు.

