2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావు పేరును మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు.
పత్తిపాటి పుల్లారావు 2014 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో వ్యవసాయ శాఖ మంత్రిగా, పుడ్ అండ్ సివిల్ సప్లైయ్స్, కన్జూమర్ వ్యవహారాలు, ధరల నియంత్రణ శాఖల మంత్రిగా పని చేశాడు.పదేళ్లపాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇతను పత్తి వ్యాపారంలో చిలకలూరిపేట వాసులకు సుపరిచితులు. 1999 ఎన్నికలలో ఇక్కడినుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2004లో ఓటమి చెందిన ఈయన మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ప్రత్తిపాటి పుల్లారావు ప్రకాశం జిల్లా బొబ్బేపల్లిలో జన్మించారు. ప్రతిపాటి పుల్లారావు బి.కాం వరకు చదివారు.

