728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 24, 2024

గణపవరం సాయి కృష్ణ డెవలపర్స్ ఫైలు ఎలా మాయమైంది వెంచర్ యజమాని ఇచ్చిన స్థలాన్ని రిజిస్టర్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన ఆ ప్రజాప్రతినిధి ఎవరు..!? గణపవరం గ్రామపంచాయతీ ఆస్తుల పరిరక్షణ చట్టం ప్రకారం జరుగుతుందా... గణపవరం గ్రామపంచాయతీ అవకతవకలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు

నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వేసిన శివ సాయి గార్డెన్స్ వారి సాయికృష్ణ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ ఫైళ్ళు గణపవరం గ్రామ పంచాయతీలో మాయమైనట్లు విశ్వసనేయంగా తెలిసిన విషయం తెలిసిందే. 

ప్రజా ప్రతినిధి, వెంచర్ యజమానుల లీలలు

అయితే ఈ విషయంలో పంచాయతీ అధికారుల, ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధుల లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. గ్రామంలో ఒక గుడి నిర్మాణం కొరకు ఒక ప్రజా ప్రతినిధి సాయి కృష్ణ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ వద్దకు చందా ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. అప్పటికే ఆ వెంచర్ గుండా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండటంతో సుమారు ఎకరం 30 సెంట్లు జాతీయ రహదారి కింద పోయి సుమారు మూడున్నర కోట్ల రూపాయల నష్టపరిహార కింద వస్తుందని తెలుసుకున్న సదరు వెంచర్ యజమాని తాను వెంచర్ కింద పది శాతం భూమిని గ్రామపంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసిన విషయం పై కొన్ని విషయాలు ఆ పెద్దమనిషి వద్ద మాట్లాడాడు. జాతీయ రహదారి కింద పోతున్న ఎకరం 30 సెంట్లు గాను అదే భూమి గ్రామపంచాయతీ కార్యదర్శి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఆ దస్తావేజు క్యాన్సిలేషన్ చేసుకోమని చెప్పమని సదరు భూమికి బదులు ఇంకోచోట భూమి ఇస్తానని తాను వెళ్లి కార్యదర్శికి చెప్పమని కోరారు. దీనికిగాను కొంత ప్రతిఫలంగా అధికారికి ఆ పెద్దమనిషి కడుతున్న గుడికి చందాగాను ఇస్తానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. 

వెంచర్ యజమానిచ్చిన స్థలం రిజిస్టర్ కాన్సిల్ చేయనని చెప్పిన కార్యదర్శి

కాగా గత మూడు సంవత్సరాల క్రితం ఆ ప్రజా ప్రతినిధి మరియు పెద్దమనిషి గణపవరం గ్రామ కార్యదర్శి వద్దకు వెళ్లి వెంచర్ యజమానులు రాసిచ్చిన రిజిస్ట్రేషన్ ను రద్దు పరచుకోమని కోరడం జరిగింది. తాను అట్లా చేయనని అట్లా చేస్తే తన ఉద్యోగం పోతుందని అతని వద్ద మొరపెట్టుకోగా అదే గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్లి కార్యదర్శి సాయం కోరారు. ఆ గ్రామ పెద్దమనిషి కార్యదర్శి అటువంటి పాడు పనులు చేయొద్దని అవసరమైతే తాను అండగా ఉంటానని చెప్పడంతో ఆ కార్యదర్శి ఆ దస్తావేజు రద్దు పరచుకోలేదు. అక్కడే కథ మొదలైంది ...ఎలాగైనా కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేయిస్తానని సదరు ప్రజాప్రతినిధి అతన్ని ట్రాన్స్ఫర్ చేయించారు. అయితే ఆ కార్యదర్శి తర్వాత ముగ్గురు కార్యదర్శులు వచ్చారు. ఒకతను ఆర్నెల్లు ఒక అతను రిటైర్ అయిన దాకా పనిచేశారు. నూతనంగా ఈ నెల ఒకటో తేదీన ఇంకొక కార్యదర్శి వచ్చారు. ఈ ఫైళ్ళని నూతన కార్యదర్శికి అప్పగించమంటే రిటైర్డ్ అయిన కార్యదర్శి ఆ వెంచర్ ఫైలే తన వద్ద లేదని చేతులెత్తేశాడు.

ఆ ఫైల్ ఏమైంది...

జాతీయ రహదారుల విస్తరణ భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఎకరం 30 సెంట్లు వెంచర్ భూమి పోగా ఆ భూమి గణపవరం గ్రామపంచాయతీకి రాసి ఇచ్చిన భూమి. అయితే ఆ భూమి ఫైలు మాయమవుటం ఏమిటని పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

188 జీవో ప్రకారం ఎందుకు ఆస్తులను పరిరక్షించుకోలేదు

గ్రామపంచాయతీ ఆస్తుల పరిరక్షణ కింద జీవో ఎంఎస్ నెంబర్ 188, తేదీ 21 .7 .2011 ప్రకారం గ్రామపంచాయతీ లేఔట్ ల నందు కేటాయించబడిన 10 శాతం భూమి మరియు పార్కులు భూములను గ్రామపంచాయతీ కాపాడుకోవాలి.

ప్రతి సంవత్సరం కొత్త లేఔట్ల ద్వారా వచ్చిన స్థలాలను సమీకరణ చేసుకొని బహుమతుల ద్వారా విరాళాలు, వారసులేని ఆస్తులు,చెరువు, కట్టలు, పోరంబోకు, స్మశానాలు తదితర ఏ,బి, సి క్యాటగిరి చెందిన భూములను గ్రామపంచాయతీ అధికారులే పరిరక్షించుకోవాలి.

పంచాయతీ ఆస్తులు ఎందుకు రిజిస్టర్ లో నమోదు చేయలేదు... ఆ ఫైలు ఎక్కడుంది

ఆస్తుల వివరాలు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తించి రిజిస్టర్ను పంచాయతీ అధికారులు తయారు చేయాలి. తదనంతరం ఉన్నతాధికారులకు నివేదించి గ్రామపంచాయతీ భూములు పబ్లిక్ వెబ్సైట్లో ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామపంచాయతీ ఆస్తులను కార్యదర్శి ప్రతి సంవత్సరం రెండుసార్లు గ్రామ సభలో పెట్టి గ్రామస్తులకు తెలియజేయాలి .

పై ప్రభుత్వ నీప నిబంధనలు ఏమి పాటించకుండా ఏ రిజిస్టర్లో గ్రామపంచాయతీ ఎన్ హాస్టల్ ఉన్నాయో నమోదు చేయకుండా సాయి డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ వారు 10 శాతం ఎంత భూమిని పంచాయతీకి రాసిచ్చారు డాక్యుమెంట్స్ లేకుండా ఫైల్ మాయమవడం రిజిస్టర్ను క్యాన్సిల్ చేసుకోమని చెప్పటంతో గణపురం గ్రామపంచాయతీలో పలు ఆకుతోకలు జరిగాయని తెలుస్తుంది.

జిల్లా అధికారులు ఫిర్యాదు చేసిన పార్టీల నేతలు

ఈ పై విషయాలు పై శుక్రవారం కొన్ని పార్టీల నాయకులు ఫైల్ మాయం విషయం, వెంచర్లు ఎన్ని, పంచాయతీ కు వున్న ఆస్తులు ఎన్ని అనే విషయం విచారణ జరపవలసిందిగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలియ వచ్చింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గణపవరం సాయి కృష్ణ డెవలపర్స్ ఫైలు ఎలా మాయమైంది వెంచర్ యజమాని ఇచ్చిన స్థలాన్ని రిజిస్టర్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన ఆ ప్రజాప్రతినిధి ఎవరు..!? గణపవరం గ్రామపంచాయతీ ఆస్తుల పరిరక్షణ చట్టం ప్రకారం జరుగుతుందా... గణపవరం గ్రామపంచాయతీ అవకతవకలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు Rating: 5 Reviewed By: NEWS UPDATE