చిలకలూరిపేట: వార్డు కౌన్సిలర్ గా గెలిచాము... గెలిచి ఈ మూడు సంవత్సరాల్లో ఏం చేశామన్నది అనేకమంది వార్డు కౌన్సిలర్ల మదిలో ఉన్న ప్రశ్న... కానీ 38 వార్డుల్లో పట్టణంలోని పదో వార్డు వినూత్న శైలిగా అభివృద్ధి చెందుతూ ఉంది. కౌన్సిలర్ గా నన్ను ఎన్నుకున్నందుకు వార్డు ప్రజలకు తన వంతు సాయ శక్తుల మంచి చేయాలని తలన్చాడు పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి. పెన్షన్లు రానివారికి ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రతి ఒక్క వృద్ధాప్య, వితంతు , వికలాంగు పెన్షన్లను అందేలా కృషి చేశారు. వార్డులో మంచినీరు రానీ ప్రాంతానికి మున్సిపల్ అధికారులతో పోరాడి మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా తెప్పించారు. కాలువల్లో దగ్గరుండి మరి సిల్ట్ తీయించడం, రోడ్లు వేయించడం, కాలువ లేని చోట్ల కాలువలు కట్టించడం నిత్యం వార్డులో పర్యటిస్తున్న వ్యక్తి కౌన్సిలర్ మౌలాలి. తాను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై రెండు నెలలు ఇంట్లో ఉన్నా కానీ... వార్డులో ప్రధాన అనుచరులను పిలిపించి వార్డులో పరిస్థితి ఏమిటని రోజు తెలుసుకొని ఫోన్ల ద్వారా వార్డు కావలసిన పనులను చేయించిన వ్యక్తి కౌన్సిలర్ మౌలాలి.
ఎమ్మెల్యేల గెలుపులో కీలకపాత్ర... చైర్మన్గా అవకాశం ఇస్తే పట్టణాభివృద్ధి...
అయితే గతంలో వైసీపీలో మొదటిగా పట్టణంలోని ముస్లిం మైనార్టీలు కలుపుకొని ఎమ్మెల్యే విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పుడు తనకు దాదాపు చైర్మన్ ఖాయమని అనుకున్నా గానీ తృటిలో అధిష్టానం వేరే వ్యక్తిని చైర్మన్గా ప్రకటించింది. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముస్లిం మైనార్టీలకు దగ్గరగా వార్డు అభివృద్ధిలో ఎనలేని కృషి చేస్తున్నా పదో వార్డ్ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలికు చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని వార్డు, పట్టణ మైనార్టీ ప్రజలు కోరుతున్నారు.
మల్లెల రాజేష్ నాయుడు గెలిపించుకుంటా
ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గానికి మల్లెల రాజేష్ నాయుడు ను అధిష్టానం ఇన్చార్జిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ప్రకటించారు. రాజేష్ నాయుడును ఇంచార్జిగా ప్రకటించినప్పటి నుండి మొదటిగా రాజేష్ నాయుడు వద్దకు వెళ్లి మైనార్టీలను ఏకం చేసి తనను గెలిపించే వ్యక్తిగా తాను ఉంటారని అన్నారు. వైసిపి ఇన్చార్జి రాజేష్ నాయుడు వెంట తిరుగుతూ ప్రతి వార్డులో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని అంటున్నారు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి.

