728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 22, 2024

చిలకలూరిపేట: గణపవరంలో కోట్ల రూపాయల భూమికి సంబంధించిన ఫైలు మాయం..!? కోట్ల రూపాయల నష్టపరిహారం ఎవరికి వచ్చింది..!?

నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామం అతిపెద్ద గ్రామం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గణపవరం గ్రామాన్ని చిలకలూరిపేట పురపాలక సంఘంలో విలీనం చేసిన అధికారులు ఐదు వార్డులకు ఎన్నికల నిర్వహించారు. అయితే కోర్టు వివాదాల వల్ల పూర్తిగా పురపాలక సంఘంలో విలీనం కాలేదు. ఆ గ్రామంలో ఐదుగురు కౌన్సిలర్లు ఒక పని జరగలేదని కౌన్సిల్ సమావేశంలో ఆరోపిస్తూ ఉన్నారు. అయితే గణపవరం గ్రామంలో పంచాయతీ తరఫున పంచాయతీ అధికారి గణపవరం గ్రామాన్ని మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా పరిపాలిస్తున్నారు.

గణపవరంలో కృష్ణ డెవలపర్స్ వెంచర్ ద్వారా పంచాయతీకి ఎంత స్థలం వచ్చింది

గణపవరం పంచాయతీలో పరిధిలో కావూరు వెళ్లే రహదారిలో గత నాలుగు సంవత్సరాల క్రితం సుమారు 40 ఎకరాల్లో శివ సాయి గార్డెన్స్, సాయి కృష్ణ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ పేరుతో వెంచర్ను అభివృద్ధి చేశారు. ఆ వెంచర్కు గణపవరం గ్రామపంచాయతీ అధికారుల పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రోడ్లు రిజర్వ్ స్థలాన్ని గ్రామపంచాయతీకి అప్పగించారు. ఇలా ఉండగా చిలకలూరిపేటకు లో తిమ్మాపురం నుండి వరకు బైపాస్ రోడ్డు ను నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వం భూమిని కోల్పోయిన బాధితులకు భూమి ప్రభుత్వ ధర నిర్ణయించి ధరకు మూడు వంతులు చొప్పున ప్రభుత్వం నిర్దేశించిన ధరను నష్టపరిహారంగా అందించారు. అయితే శివ సాయి గార్డెన్స్ వారు గణపవరం గ్రామపంచాయతీకి అప్పగించిన రిజర్వ్ సైట్ రోడ్లు స్థలం సుమారుగా ఒక ఎకరం 30 సెంట్లు బైపాస్ రోడ్డు విస్తీర్ణంలో పోయినట్లు విశ్వసినీయంగా తెలిసింది. ఆ స్థలానికి నష్టపరిహారంగా ప్రభుత్వం నుండి తమకు నష్టపరిహారం రావాలని పంచాయతీ అధికారులు నామాత్రంగా ఒక లెటర్ పెట్టి అధికారుల చుట్టూ తిరిగితే ఇది ప్రభుత్వ స్థలం నష్టపరిహారం ఇవ్వమని చెప్పినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు.

ఆ నష్టపరిహారం ఎవరు తీసుకున్నారు!?

ఇది ఇలా ఉండగా అదే గ్రామానికి చెందిన ఎండోమెంట్ స్థలము బైపాస్ రోడ్ నిర్మాణం కింద పోవటంతో ప్రభుత్వం సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఎండోమెంట్ వారికి అందించింది. అయితే గణపవరం గ్రామానికి చెందిన పంచాయతీ స్థలానికి ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వదని అధికారులు చెప్పుకోచ్చారు. సాయి కృష్ణ డెవలపర్స్ చెందిన వెంచర్ వారు పొలాన్ని గజాలకింద మార్చి వెంచర్ను వేసారు.ఆ వెంచర్ లో కొంత స్థలం డెవలపర్స్ వారిది కూడా బైపాస్ రోడ్ కింద పోవడంతో వారికి కూడా నష్టపరిహారం అందించారు. అయితే ఇటు గ్రామపంచాయతీకి ఒక ఎకరం 30 సెంట్ల కింద రావాల్సిన సుమారు మూడు కోట్ల 30 లక్షల రూపాయలు రాకపోగా ఆ డబ్బు వెంచర్ వారు తీసుకున్నారా లేక ఎవరు తీసుకున్నారని గణపవరం గ్రామంలోని గ్రామ పెద్దలు పలు అనుమానాలకు తావిస్తుందని ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.

ఆ ఫైల్ ఏమైంది

అసలు విషయం ఏమిటంటే సాయి కృష్ణ గార్డెన్స్ కు చెందిన సాయి కృష్ణ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ వారి రిజర్వ్ సైటు రోడ్లకు ఇచ్చిన స్థలం ఎంత. అనే విషయం గురించి ప్రస్తుత సెక్రటరీ సింగరాజు మారుతి బాబును అడుగ తాను ఇంకా చార్జి తీసుకోలేదని తెలియజేశారు. కొసమెరుపు ఏమిటంటే సాయి కృష్ణ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ చెందిన ఆ ఫైలు గణపవరం పంచాయతీ కార్యాలయం నుండి మాయమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వెంచర్ వివరాలను విలేకరులు అడగ్గా తమ వద్ద ఫైల్ లేదని ఈనెల 1వ తేదీన రిటైర్డ్ అయిన సెక్రటరీ అరవపల్లి శేఖర్ తెలిపారు. కొన్ని ఎకరాల స్థలం వెంచర్ ద్వారా గ్రామపంచాయతీకి వచ్చిన విషయం తెలియకుండా దాచేందుకే అధికారులు ఒక ప్రజా ప్రతినిధి చెప్పినట్లు విని ఆ ఫైల్ ను మాయం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలని గణపవరం గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: గణపవరంలో కోట్ల రూపాయల భూమికి సంబంధించిన ఫైలు మాయం..!? కోట్ల రూపాయల నష్టపరిహారం ఎవరికి వచ్చింది..!? Rating: 5 Reviewed By: NEWS UPDATE