చిలకలూరిపేట: మండలంలోని ఎడవల్లి గ్రామంలో కోటప్పకొండ తిరణాలకి ప్రభలు పోకుండా ఆర్చి నిర్మించారని... కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎడవల్లి సర్పంచి తిరుమలేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. కాపుల స్మశాన స్థలం ఆక్రమించుకున్నారని ఈ విషయంపై కోర్టు తీర్పు ఇచ్చిన చిలకలూరిపేట నుండి ట్రాన్స్ఫర్ ఐ వెళ్లిపోయిన ఒక మహిళ తహసిల్దార్ వారికి వత్తాసు పలికారని సర్పంచ్ తెలిపారు. కాపులకు స్మశాన వాటిక కూడా దక్కనివ్వరా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీ నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమని ఎందుకు పట్టించుకోరు అని సర్పంచి తిరుమలేశ్వరి ఆక్రోశం వెళ్లగక్కారు.
February 27, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఒక తహాసిల్దారు వత్తాసు... కాపులకు స్మశాన స్థలం కూడా దక్కనివ్వరా... మహిళా సర్పంచి సంచలన ఆరోపణ
Rating: 5
Reviewed By: NEWS UPDATE
