728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 30, 2024

చిలకలూరిపేట వరలక్ష్మి ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యం... సంక్లిష్ట శస్త్ర చికిత్సతో తల్లి బిడ్డ క్షేమం

చెంతనే గ‌ర్బిణీల‌కు వైద్యం.. చిల‌క‌లూరిపేట‌లో ఆరోగ్యభాగ్యం! 

వ‌ర‌ల‌క్ష్మి ఫెర్టిలిటీ& మెటర్నిటీ ఆసుపత్రి లో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌
సంక్లిష్ట శ‌స్త్ర‌చికిత్స‌తో త‌ల్లి,బిడ్డ క్షేమం

చిల‌క‌లూరిపేట‌: వెద్య రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుబాటులోకి వస్తున్న అధునాతన వైద్య విధానాల‌తో రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అందుబాటులో వ‌స్తున్న అధునాత‌న వైద్య సేవ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌లింపు చేసుకొని మాతా,శిశువు ఆరోగ్యానికి అత్యంత‌ ప్రాధాన్య‌త ఇస్తూ చిల‌క‌లూరిపేట‌లోని వ‌రలక్ష్మి ఫెర్టిలిటీ& మెటర్నిటీ ఆసుపత్రి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతుంది. వైద్య చ‌రిత్ర‌లోనే  అతి కిష్ట‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఆసుప‌త్రి వైద్యులు డాక్టర్ గరికపాటి వరలక్ష్మి కొమ్మినేని త‌న వైద్య సేవ‌ల ద్వారా స‌మాధానం చెబుతున్నారు. 

సంక్లిష్ట శ‌స్త్ర‌చికిత్సతో త‌ల్లి,శిశువు ప్రాణాలు కాపాడారు… 

వైద్య చ‌రిత్ర‌లో అతి కిష్ట‌మైన శ‌స్త్ర‌చికిత్స‌ను ఇటీవ‌ల నిర్వ‌హించి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందారు. ఈ నెల 21వ తేదీ  తెనాలికి చెందిన  సయ్యద్ హమీద్ గ‌ర్బిణి క‌డుపునొప్పితో ఆసుప‌త్రిలో చేరింది. ఇది ఆమెకు మూడో కాన్పు. రెండు కాన్పులు కూడా ఆసుప‌త్రిలోనే చేయించుకున్న ఆమెను బంధువులు ఆసుప‌త్రిలో చేర్చారు. ర‌క్తం త‌క్కువ‌గా ఉండ‌టంతో ర‌క్తం ఎక్కించి సీజ‌రేయ‌న్ ద్వారా కాన్పుకు వైద్యురాలు వ‌ర‌ల‌క్ష్మి  సంసిద్దం చేశారు. అయితే  శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో గ‌ర్బ‌సంచి ప‌గ‌లిపోయి ఉండ‌టం, గ‌ర్బాశ‌యం బ‌య‌ట  పేగుల మీద  శిశువు ఉండటం గ‌మ‌నించారు. ఇది సంక్లిష్ట ప‌రిస్థితి. ఏం మాత్రం తేడా వ‌చ్చినా త‌ల్లితో, శిశివు ప్రాణాల‌కే ముప్పు ఏర్ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇలాంటి కేసుల్లో రిస్కు ఎక్కువ‌. మ‌ర‌ణాల రేటే అధికంగా ఉంటుంద‌ని వైద్య వ‌ర్గాలు చెబుతారు.  ఈ స‌మ‌యంలోనే వైద్యురాలు స‌రైన చికిత్స అందించ‌టంతో త‌ల్లితో, శిశువు ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట ప‌డ్డారు. 

అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌… డాక్ట‌ర్ వ‌ర‌ల‌క్ష్మి, ఆసుప‌త్రి వైద్యురాలు

ఈ సంద‌ర్బంగా డాక్ట‌ర్ గ‌రిక‌పాటి వ‌ర‌ల‌క్ష్మి మాట్లాడుతూ ఇలాంటి ప‌రిస్థితులు గ‌ర్బిణీల‌లో అరుదుగా సంబవిస్తుంటాయ‌ని చెప్పారు. 40% మంది స్త్రీలు ముందు నుంచీ రక్తహీనులుగానే ఉంటున్నార‌న్నారు. ఇటు తల్లిపైన, అటు పుట్టబోయే బిడ్డపైన కూడా కాల్షియం, ఇతర విటమిన్ల లోపాల ప్రభావం అధికంగానే ఉంటోందని చెప్పారు. అతి తక్కువ బరువు లేదా అధిక బరువు వల్ల పిండం ఎదుగుదల, కాన్పు వంటి విషయాల్లో అనుకోని ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు వగైరా తీసుకోవాలని . మొదటి ఆరునెలలు .... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరమని వెల్ల‌డించారు. ఏదైన స‌మ‌స్య క‌నిపిస్తే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట వరలక్ష్మి ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యం... సంక్లిష్ట శస్త్ర చికిత్సతో తల్లి బిడ్డ క్షేమం Rating: 5 Reviewed By: NEWS UPDATE