చిలకలూరిపేట పట్టణం కుక్కల పెంపకం కేంద్రంగా మారిందని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఏ వీధికి వెళ్లాలన్నా ....ఏ గొంది తిరగాలన్న.... ఏ బజార్లో వెళ్లాలన్నా కుక్కలు బైక్లు వాహనాల మీద వెళ్లే వారిని వెంటబడటం... కుక్కలు కరుస్తాయనే భయంతో ఆ వాహనదాలు కింద పడిపోవడం దెబ్బలు తగలటం ఇక్కడ పరిపాటే అయింది.
చిలకలూరిపేటలో కోతుల సంచారం లాగా కుక్కలు గుంపులు గుంపులుగా చేరి రాత్రనక పగలనకా వీధివీధిన తిరగటం గత కొన్ని నెలల నుండి చూస్తూనే ఉన్నాం. గతంలో మున్సిపల్ కమిషనర్ కుక్కలను పట్టి ఆపరేషన్ చేయించి ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం చేస్తానని తూతు మంత్రంగా చెప్పి చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. మరలా ప్రస్తుతం వచ్చిన కమిషనర్ ఇదే మాట చెబుతున్నాడని కౌన్సిలర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పదో వార్డు కౌన్సిలర్ మౌలాలి కుక్కల దాడిలో తప్పించుకోబోయే యాక్సిడెంట్ అయి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని ఇదే విషయాన్ని కౌన్సిల్ హాల్ లో బహిరంగంగా చెప్పగా చాలామంది నవ్వుకున్నారు. అలానే అనేకమంది కౌన్సిలర్లు కుక్కల బెడద గురించి చెప్పినా సంబంధిత అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరించడం చిలకలూరిపేట ని కుక్కల పెంపకం కేంద్రంలో మార్చారేందని కౌన్సిలర్లే ముక్కున వేలేసుకుంటున్నారు.
చిలకలూరిపేటలో ఆదివారం17 మందిని కరిచిన కుక్కలు
చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం, శాంతినగర్ ,అడ్డరోడ్డు సెంటర్, సుబ్బయ్య తోట సెంటర్లలో కుక్కలు కొన్ని స్వైర విహారం చేసి 17 మందిని కరిసాయి. వీరందరూ చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా కుక్కకరిస్తే చేసే రాబిస్ వ్యాక్సిన్లు ఆసుపత్రిలో లేవని చెప్పటంతో కుక్కకాటుకు బలైన వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆవేదన వర్ణనాతీతం. తమ పిల్లలను కుక్క కాటు నుండి కాపాడటానికి కావలసిన రాబిస్ ఇంజక్షన్లు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసి ....చిలకలూరిపేట లో ఎవరిని కుక్కలు కరవకుండా కాపాడాలని రెండు చేతులెట్టి దండం పెడుతున్నారు వారు...
ఇప్పుడైనా సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకుంటారా లేదా అనేది కొన్ని సంవత్సరాలు వేసి చూడాల్సిందేనా...!??