728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 5, 2025

కంచె చేను మేస్తే కనిపెట్టేవారెవరు? లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యం దారిమళ్లింపు రేషన్ షాపుకు వెళ్ళకుండానే బ్లాక్ మార్కెట్కు...


 వినుకొండ: పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు కాస్త ఆసరాగా ఉంటాయనుకుంటే పెద్దలకుకాసులుకురిపిస్తున్నాయి. రేషన్ బియ్యం దందాను ఎవ్వరూ అరికట్టలేని పరిస్థితి నెలకొంది. 'రుచిమరిగిన కోడి వరిమళ్ల దావ పట్టిందన్న' చందంగా అక్రమార్కులుఈ వ్యాపారాన్ని విడిచిపెట్టలేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని నిబంధనలు, చర్యలు చేపట్టినా కొత్త కొత్త ఆలోచనలతో తమ పని పూర్తి చేసుకుంటున్నారు. కంచె చేను మేస్తే కాదనే వారెవరు?పాలకులే ఇది సహజ మనుకుంటే ప్రశ్నించే దెవరికి? అన్న చందంగా వినుకొండ సివిల్ సప్లై అధికారులవైఖరి స్పష్టం అవుతుంది. గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం నల్ల బజారుకు చేరుకుంటుందని నానా యాగి చేసిన ప్రస్తుత పాలకులు అదే రేషన్ బియ్యాన్ని యదేచ్చగా పట్టపగలే నల్ల బజారుకు తరలిస్తూ ఉంటే చూసి చూడనట్లు నటిస్తున్నారు. పేదలకు అన్యాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు తరలించిపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఆచరణలో అక్కడికి చేరకుండానే మార్గమధ్యలోనే నల్లబ జారుకు యదేచ్చగా చేరుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో వినుకొండ పట్టణంలోని గోదామునుండి సరుకు నేరుగా బొల్లాపల్లి మండలం కనుమలు చెరువు గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే అక్కడికి చేరకుండానే మార్గమధ్యంలో సరుకు మాయమైంది . దాదాపు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటంతోకొందరు కాపు కాసి పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారీ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వారి కన్నుకు కప్పేందుకు నాన తంటాలు పడ్డారు. గోదాము నుండి సరుకు నింపుకున్న ఆటో వాహనము పిచ్చుకల పాలెం, చిన్నకంచెర్ల గ్రామాల వైపు పరుగులు తీసింది. చుట్టూ తిరిగి మరలా వినుకొండకు చేరుకొని అటు నుండి బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైస్ మిల్లుకు బియ్యం మూటలను తరలించి నిలువ చేశారు. గ్రామానికి చేర్చవలసిన బియ్యం లోడుబ్రాహ్మణపల్లి మిల్లుకు ఎందుకు తరలించారో అధికారులకు తెలియాలి. ఈ లోడు తరలించే క్రమంలో బాధ్యత గల అధికారి కూడా ఆవాహనాల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా సదరు రేషన్ షాపుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న గ్రామ సచివాలయ అధికారి కనుసన్నల్లో బియ్యం దారిమళ్లించినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు.కాగా తమ గ్రామానికి రావలసిన బియ్యం లోడు రాకపోవడంతో పాటు అది ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలుసుకున్న కనుమలచెరువు గ్రామానికి చెందిన పలువురు ఈ విషయమై సివిల్ సప్లై మరియు రెవిన్యూ అధికారులకు చరవాణి ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించకపోవడం అనుమానంగా ఉన్నది. దీనిబట్టి సంబంధిత అధికారులకు తెలిసే బియ్యం లోడు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందనిస్పష్టమవుతుంది. ఈ సంఘటన పట్ల ఉన్నత ఉన్నతాధికారులు తక్షణం స్పందించి విచారణ జరిపిస్తే దొంగలు దొరుకుతారూ అనడంలో సందేహం లేదు. పాలకవర్గాలు సైతం ఈ సంఘటనపై స్పందించాల్సిన అవసరం ఉంది. సదరు రేషన్ షాపు పరిధిలోని లబ్ధిదారులను నేరుగా తమ ఇళ్ల వద్ద విచారిస్తే ఎన్ని నెలలుగా ఈ తంతు నడుస్తోంది.. సదరు బియ్యం లబ్దిదారులకు ఇవ్వ కుండాఎటుపోతున్నాయన్నది తేలుతుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కంచె చేను మేస్తే కనిపెట్టేవారెవరు? లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యం దారిమళ్లింపు రేషన్ షాపుకు వెళ్ళకుండానే బ్లాక్ మార్కెట్కు... Rating: 5 Reviewed By: NEWS UPDATE