ఈపూరు:చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. జీవి చిన్నారులలో ఎదుగుదల లోపాలు లేకుండా పలు పథకాలు అందిస్తున్నాయి. పోషక ఆహారాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోషణ పక్షోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నాయి. పక్షోత్సవాలను మంగళవారం నుండి ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ బి అరుణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు.మొదటి 1000 రోజుల సంరక్షణ,పోషణ ట్రాకర్ app లో స్వయంగా ఆరోగ్య పరిస్థితి తనిఖీ గురించి లబ్ధిదారులకు అవగాహన, లోప పోషణ పిల్లల ను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆరోగ్య పరీక్షలు , పోషకాహారం , సమాజ మద్ధతు ను పాటించేలా చర్యలు,ఊబకాయం తగ్గించుటకు ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతిఅంగన్వాడి,పంచాయతీ,మండలస్థాయి కార్యక్రమాలు సంబంధించిన లైన్ డిపార్టుమెంటు ల సమన్వయంతో మరియు నాయకుల మద్ధతు తో నిర్వహించబడటం జరుగుతుందన్నారు.
పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా జీవించాలి... సీడీపీఓ