ఈపూరు:పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని సిడిపిఓ బి అరుణ అన్నారు.ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 7వ పోషణ పక్షోత్సవ వేడుకలు మండలంలోని ఊడిజర్ల ఎస్సీ కాలనీ అంగన్వాడి కేంద్రం నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సర్పంచ్ ఆదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు మెరుగైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందిం చుకోవచ్చునని,తల్లులకు వెయ్యి రోజుల సంరక్షణ గురించి వివరించారు. తల్లిపాల విశిష్టత, కాంప్లిమెంటరీ ఫీడింగ్, చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాలలోపు వయసులో ఉన్న అనారోగ్య సమస్యలను త్వరగా గుర్తించగలడం ద్వారా వారిని త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకురాగలమని బాల్య వివాహాల వలన తల్లి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం పొందలేరని మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు ఫ్రీ స్కూల్ విద్య అభ్యసించడం ద్వారా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు కే చిన్నమ్మాయి అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలు గర్భిణీలు తల్లులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం