728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 16, 2025

ధనలక్ష్మి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ....


 ఈపూరు:ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని శ్రీ ధనలక్ష్మి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గడిపుడి నరసింహారావు అన్నారు. మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో శ్రీ ధనలక్ష్మి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న తమ కళాశాల విద్యార్థులు ఈనెల 12వ తేదీన విడుదలైన జూనియర్ సీనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలలో జూనియర్ ఇంటర్ సీఈసీ గ్రూపు నందు నందిగం శోభారాణి, సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపు నందు మాయకుంట కావ్య అశ్విని, మేకల బాలచంద్రశేఖర్, పూజల గోపి చంద్రశేఖర్ సిఇసి గ్రూపు నందు చాట్ల సన్నీ, చాట్ల ఏసోబులు అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ గడిపుడి నరసింహారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ   విద్యార్థులు కష్టపడి చదవడం ద్వారా వారు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి మరియు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారడానికి సహాయపడుతుందన్నారు. అనంతరం తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులను కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మెదరమెట్ల రామశాసగిరి రావు అధ్యాపకులు, కళాశాల సిబ్బంది అభినందించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ధనలక్ష్మి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ.... Rating: 5 Reviewed By: NEWS UPDATE