చిలకలూరిపేట పురపాలక సంఘం చరిత్రలో నిలిచిపోయేలా.... గతంలో ఎన్నడు లేని విధంగా.... గంగాభవాని కుంభకోణం నేడు 15 మంది అధికారులను బలి తీసుకుంది. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన గంగాభవాని 34 లక్షల 34 397 రూపాయలు అవినీతి జరిగినట్లు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు, అప్పటి వైసిపి కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి అడిగినందున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై ఇరవై ఒక్క లక్షల రూపాయలు పైన రికవరీ చేయవలసి ఉండగా టౌన్ పోలీస్ స్టేషన్ లో 25 జనవరి 2025 నా కేసు నమోదు అయింది. అలానే క్యాషియర్ప పనిచేస్తున్న నక్క జెస్సి ప్రవీణ్ అనే వ్యక్తి 13 లక్షల అరవై ఏడు వేల రూపాయలు కుంభకోణం చేసినట్లు వెలుగులోకి పత్రికలు ప్రతిపక్ష నాయకులు బయటకు తేవడంతో ఇతనిపై పట్టణ పోలీస్ స్టేషన్లో 25/2025గా కేసు నమోదు అయింది.
జూనియర్ అసిస్టెంట్ లో కాలేశా, గురవయ్య, జమీర్, రమేష్లు ఉండగా... మేనేజర్లలో విజయలక్ష్మి , నగీన సుల్తానా లు ఉన్నారు. రెవిన్ క్లర్కుగా ఉన్నవారిలో శ్రీనివాసమూర్తి, వెంకటేశ్వర్లు, అల్లాబక్షు ,అబ్దుల్ ఖాదర్లు ఉన్నారు.
అకౌంటెంట్గా చేసిన వారిలో మానస కృష్ణ, ధనలక్ష్మి లు ఉన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ వీరిపై శాఖాపరమైన కేసులు నమోదు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరందరూ గంగాభవాని, నక్క జెస్సీ ప్రవీణ్ చేసిన కుంభకోణాలను సూపర్ వైట్ చేయటంలో ఫెయిల్ కావటం వల్లే ఈ కుంభకోణాలు జరిగినట్లు మున్సిపల్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి..