వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల ఆర్ అండ్ బి రహదారి మార్జిన్‌ను దర్జాగా ఆక్రమిస్తున్నారు.రహదారిని ఆక్రమించి రేకుల షెడ్ నిర్మించిన పట్టించుకునే వారే కరువయ్యారు.సంబంధిత అధికారులు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆక్రమణలకు అడ్డుచెప్పేవారు లేరు. దీనితో రహదారి ఇరు వైపులా ఆక్రమణలతో కుచించుకుపోయింది. విశాలంగా రహదారులు ప్రస్తుతం ఇరుకు రోడ్లుగా మారిపోయాయి. భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతతో ఎక్కడ ఖాళీ స్థలం కనపించినా పాగా వేసేస్తున్నారు.రోడ్లు ఇరుకుగా ఉండటంతో పెద్ద వాహనాలు ఎదురెదురుగా వస్తే తప్పుకునే అవకాశం లేక ప్రమాదాలకు గురవుతున్నాయి.వాహనదారులు, ప్రయాణికులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. అండ్ బీ రోడ్డును ఆక్రమించి శాశ్వతంగా రేకుల షెడ్ నిర్మించారు. ఆర్ అండ్ బి రోడ్డు స్థలం ఆక్రమించి రేకులు షెడ్ నిర్మించినా పట్టించుకునే వారే కరువయ్యారుఅధికారులు స్పందించి ఆర్ అండ్ బి రోడ్ల ఆక్రమణలను తొలగించి రోడ్లను పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.
June 11, 2025
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: యదేచ్చగా ఆర్ అండ్ బి స్థలం ఆక్రమణ చోద్యం చూస్తున్న అధికారులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE