విద్యుత్ సరఫరాలో అంతరాయం - చిలకలూరిపేట, పరిసర ప్రాంతాలు
జూలై 12, 2025 (శనివారం), సబ్‌స్టేషన్లలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ విద్యుత్ అంతరాయం కింది ప్రాంతాలలో ఉంటుంది:
టౌన్ పరిధి
చిలకలూరిపేట టౌన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు.
రూరల్ మండలం
చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని వేలూరు, కుక్కపల్లివారిపాలెం, పంగుళూరివారి పాలెం, తుర్లపాడు, సందేపూడి, పసుమర్రు, బొప్పూడి, కావూరు, కట్టుబడివారిపాలెం గ్రామాలకు.
నాదెండ్ల మండలం
నాదెండ్ల మండల పరిధిలోని గణపవరం టూ కావూరు రోడ్డు, అవిసాయపాలెం, కనపర్రు, ఇర్లపాడు, ఎండుగుంపాలెం, బుక్కాపురం, రాజుగారిపాలెం, గున్నావారిపాలెం, గణపవరం, రాజీవగాంధీ కాలనీ, బోస్ గారి మిల్, కోళ్లపారం, నాదెండ్ల, చిరుమామిళ్ల, గోరిజవోలు, సంకరాత్రిపాడు, జంగాలపల్లి, తుబాడు గ్రామాలకు.
యడ్లపాడు మండలం
యడ్లపాడు మండలంలోని అన్ని గ్రామాలకు.
పైన తెలిపిన ప్రాంతాలు, గ్రామాలలో గృహ, వ్యవసాయ, వాణిజ్య, చిన్న, భారీ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము.
అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.