జూలై 5, 2025 శనివారం, యడ్లపాడు మండలంలోని సొలస, లింగారావుపాలెం, చేంగిజ్ ఖాన్ పేట గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.
ట్రాన్స్‌ఫార్మర్ మరియు లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని ఆర్. అశోక్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట తెలియజేశారు.