అయిల్ దొంగతనం కేసులో బొల్లాపల్లి మండల వాసులు
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల్లో, బస్సుల్లో అయిల్ చోరీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్టు
ఒక ఇన్నోవా వాహనం, కాలీ రమ్ములు స్వాధీనం
వినుకొండ :- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయిల్ చోరీకి పాల్పడుతున్న దొంగలను అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు...రాత్రి వేళల్లో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న లారీల్లో, బస్సుల్లో అయిల్ దొంగతనం చేస్తున్న పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా కు చెందిన నలుగురు ని పోలీసులు అరెస్టు చేశారు... వారి వద్ద ఖాళీ రమ్ములను, వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు... నిందితులు గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా తో పాటు, పల్నాడు జిల్లా లో పలు ప్రాంతాల్లో అయిల్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.