728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 19, 2025

నేడు సీఎం సమక్షంలో టిడిపిలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి


చిలకలూరిపేట :ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, ఈ సంవత్సరం మార్చి 19న ఆ పార్టీకి రాజీనామా చేసారు.

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తన అనుచరులు, అభిమానులతో చాలాసార్లు చర్చించిన తర్వాత, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు శుక్రవారం 19 న సాయంత్రం 6 గంటలకు   టిడిపిలో చేరుతున్నారనీ విశ్వసనీయంగా తెలిసింది.మర్రి రాజశేఖర్‌తో పాటు ఆయన అనుచరులు, ఆయనను అనుసరించే నాయకులు ఎప్పుడు పార్టీలో చేరతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు సీఎం సమక్షంలో టిడిపిలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి Rating: 5 Reviewed By: NEWS UPDATE