చిలకలూరిపేట: మామయ్య సంవత్సరీకం కోసం హైదరాబాద్ నుంచి చిలకలూరిపేటకు వస్తున్న ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాగనపాలెంలో విషాదం అలుముకుంది.
చిలకలూరిపేట పట్టణం, రాగనపాలెంకు చెందిన తవనం నాగరాజు (45) హైదరాబాద్ లో ట్రావెల్స్ లో పనిచేస్తున్నారు. ఆదివారం తన తండ్రి సంవత్సరీకం ఉండటంతో అతను భార్య ప్రమీల (40)తో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. గుంటూరులో బస్సు దిగి బైక్ పై చిలకలూరిపేటకు వస్తున్నారు.
అయితే, జాతీయ రహదారిపై మిట్టపల్లి సమీపంలో బైక్ పై ఉన్న బ్యాగ్ జారి పడుతుండటంతో బ్యాగ్ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె జారీ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యి ప్రమీల అక్కడికక్కడే మరణించింది. భర్తకు నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ విషాద వార్త తెలియగానే రాగనపాలెంలో శోకం అలుముకుంది. వారి కుటుంబానికి అండగా ఉండటానికి బంధువులు, స్నేహితులు అక్కడికి చేరుకుంటున్నారు.