చిలకలూరిపేట: తాను నివసిస్తున్న ఊరు బాగు కోసం నిరంతరం తపన పడుతుంటారు. రెండు దశాబ్దాలకు పైగా ఉద్యోగ జీవి తంలో గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఊరికి ఉప కారిగా నిలుస్తున్నారు. ఆయనే మండలంలో సర్వేయర్గా పనిచే స్తున్న యద్దనపూడి ప్రసాద్. ఆయనకు పిల్లలు లేరు. 'ప్రేమామ యుని నిలయం' పేరుతో ఓ భవనం నిర్మించి ఎంతో మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి సేవలందిం చారు. ప్రస్తుతం అక్కడ పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆ భవనాన్ని అంగన్వాడీ కేంద్రానికి అప్పగించారు. తన స్వగ్రామమైన గొట్టిపాడు ప్రధాన కూడలి వద్ద రెవెన్యూ భవనం తన సొంత డబ్బుతోనే నిర్మిం చారు. గ్రామంలో రెండు చోట్ల బస్ షెల్టర్లు, మూడు చేతిపంపులు, శుద్ధ జల కేంద్రం ఏర్పాటుచేశారు. గ్రామంలో పోస్టాఫీసు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి నూతన భవనాన్ని తన సొంత నిధులతో నిర్మించారు. దానిని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. యద్దనపూడి ప్రసాద్ ప్రభుత్వ ఉద్యో గిగా విధులు నిర్వహిస్తూ తనకు ఉన్నంతలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
November 22, 2025
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి... అయినా సేవా కార్యక్రమలు... గ్రామ అభివృద్ధికి సహకారం
Rating: 5
Reviewed By: NEWS UPDATE


