728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 5, 2026

చిలకలూరిపేట పురుషోత్తపట్నం లో పట్టపగలే చైన్ స్నాచర్ల తెగింపు

 


చిలకలూరిపేట

పురుషోత్తమపట్నంలో పట్టపగలే చైన్ స్నాచర్ల తెగింపు

వృద్ధురాలి మెడలోని రెండు సవర్ల బంగారు చైను అపహరణ

మాటలు కలిపి క్షణాల్లో చేతివాటం

 సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల గాలింపు

చిలకలూరిపేట:

పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నంలో చైన్ స్నాచర్లు బరితెగించారు. స్థానిక అచ్చు కోలా భాస్కర్ వీధిలో నివాసముండే పసుపులేటి గీత (60) అనే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే ఈ దురాగతానికి ఒడిగట్టారు.

పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి...ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గీతను వెంబడించి, ఆమె ఇంట్లోకి వెళ్లగానే వెనుకే చొరబడ్డారు. ఎంతో పరిచయం ఉన్నవారిలా ఆమెతో మాటలు కలుపుతూ దృష్టి మళ్లించారు. బాధితురాలు తేరుకునే లోపే మెడలోని రెండు సవర్ల (16 గ్రాముల) బంగారు గొలుసును బలవంతంగా తెంచుకున్నారు. అనంతరం బయట సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్ర వాహనంపై క్షణాల్లో పరారయ్యారు.

కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు

కూలీనాలి చేసుకుంటూ, రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో ఇష్టంగా ఆ చైను చేయించుకున్నానని బాధితురాలు గీత గుండెలు పగిలేలా విలపించారు. ఆమె రోదనను చూసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం:సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పురుషోత్తపట్నం లో పట్టపగలే చైన్ స్నాచర్ల తెగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE