728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 21, 2026

ఈపూరులో విశాలాంధ్ర జర్నలిస్ట్ కు సన్మానం


 ఈపూరులో విశాలాంధ్ర విలేకరికి ఘన సన్మానం...

ఈపూరు: మాలపల్లి సేవా సొసైటీ ఆధ్వర్యంలో విశాలాంధ్ర విలేకరి కోటేశ్వరరావు ని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మండల కేంద్రమైన ఈపూరు నందు మాలపల్లి సేవా సొసైటీ సభ్యుల సమక్షంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు వేళంగి కుమార్ మాట్లాడుతూ జర్నలిజం సమాజానికి అద్దం పట్టే వృత్తి అని అన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా విలేకరులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడం, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో పాత్రికేయుల బాధ్యత ఎంతో కీలకమని వేళంగి కుమార్ అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులు స్థానిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.అనంతరం విశాలాంధ్ర విలేకరి మాట్లాడుతూ మాలపల్లి సేవా సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు,అభినందనీయమన్నారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు అండగా నిలవడం, ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించడం, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సొసైటీ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ కావాలనిఆకాంక్షించారు.

కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, నిర్వాహకులు, స్థానికులు పాల్గొని విశాలాంధ్ర విలేకరిని శాలువా, పూలమాలతో సత్కరించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈపూరులో విశాలాంధ్ర జర్నలిస్ట్ కు సన్మానం Rating: 5 Reviewed By: NEWS UPDATE