728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 24, 2020

ఈ బుడ్డ చెఫ్‌కు 14 లక్షల ఫాలోవర్లు

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు కొత్త కొత్త వంటల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయడం సాధారమైపోయింది. వివిధ ప్లాట్‌ఫాంలపై వచ్చే వంటల  వీడియోలను చూసి అనుకరించేందుకు చాలా మంది తహతహలాడుతున్నారు. అయితే ఈ 'చెఫ్‌ కోబ్‌'కు మాత్రం లాక్‌డౌన్‌ ఎనలేని ఆదరణ తెచ్చిపెట్టింది. ఫుడ్‌ వీడియోల కోసం  ఇన్‌స్టాగ్రామ్‌లో వెతగ్గానే చెఫ్‌ కోబ్‌ ప్రత్యక్షమై మనల్ని ఆనందపరవశుల్ని చేస్తున్నాడు. ఇంతకీ ఈ బుడ్డోది వయసు ఏడాదే. వీడికున్న ఫాలోవర్ల మాత్రం 14 లక్షలు. అమ్మ బాబోయ్‌! అని నోరెళ్లబెట్టకండి.ఇది నిజం.తల్లి పక్కనే ఉండి ఏది చెబితే అది హుశారుగా చేస్తూ మనల్ని నవ్విస్తున్నడు ఈ చెఫ్‌ కోబ్‌. ఈ చిన్నోడికి వంట చేయడం, తినడం, వంటింట్లో ఆన్వేషించడం అలవాటంట. బటర్‌ చికెన్‌తో నాన్‌ చేశా.. మీకు తప్పక నచ్చుతుంది.. ఐలవ్‌ నాన్‌.. అంటూ మూడు రోజుల క్రితం పెట్టిన పోస్టును లక్షలాది మంది వీక్షించగా.. 6,700 మంది కామెంట్లు పెట్టారు. కోబ్‌ ఈట్స్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిబ్రవరి నెలాఖరు నుంచి వీడియోలు పోస్ట్‌ చేస్తుండగా.. ఏప్రిల్‌ 15 వరకు 200 మంది ఫాలోవర్లు మాత్రమే వచ్చారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో వంటల వీడియోలు సెర్చ్‌ చేయడం ఎక్కువవడంతో.. చెఫ్‌ కోబ్‌కు చెప్పరానంత మంది అభిమానులు లభించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ బుడ్డ చెఫ్‌కు 14 లక్షల ఫాలోవర్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE