★ గల్ఫ్ దేశాల్లో శుక్రవారం చంద్రుడు కనిపించలేదు.
★ శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ జరపాలని సౌదీ అధికారులు నిర్ణయించారు.
★ రంజాన్ మాసం ఉపవాసాలు ఈ పండుగతో ముగియనున్నాయి.
★ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈద్ ప్రార్థనలతోపాటు పండుగ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని ముస్లిమ్ మతపెద్దలు సూచించారు.
★ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చంద్రుని వీక్షణ కోసం యూఏఈ న్యాయశాఖ మంత్రి అధ్యక్షతన వీక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.
★ సౌదీఅరేబియాలోని రియాద్ నగర సమీపంలోని మజ్మా విశ్వవిద్యాలయం అబ్జర్వేటరీలో ఖగోళ శాస్త్రవేత్తలు శుక్రవారం షవ్వాల్ నెలవంకను చూసే అవకాశం లేదని ధ్రువీకరించారు.
★ కర్ణాటక రాష్ట్రంలోనూ శుక్రవారం చంద్రుడు కనిపించలేదు.
★ లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ మే 23వతేదీనే ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని నిర్ణయించారు.
★ కేరళ, కర్ణాటక ప్రాంతా్లో మే 24వతేదీన ఈద్-ఉల్-ఫితర్ జరపాలని నిర్ణయించినట్లు కేరళలోని హిలాల్ కమిటీ పేర్కొంది.
★ మొత్తం మీద భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈద్-ఉల్-ఫితర్ ఏ రోజు జరుపుకుంటారనే విషయం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.