లాక్‌డౌన్ నియమాలు సడలించిన క్రమంలో.. విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు అధికారులు. దేశీ సర్వీసులను మే 25నుంచి ఓ క్రమ పద్ధతిలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం కార్గో, ఎవాక్యుయేషన్ విమానాలను నడిపేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.జాతీయ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన క్రమంలో కొన్ని రిలాక్సేషన్లకు మాత్రం అవకాశం ఇచ్చారు. అన్ని ఎయిర్‌పోర్టులు, అన్ని విమానలు వచ్చే వారం జరగనున్న ప్రయాణాలకు సిద్ధం అవుతున్నాయి.ఈ మేరకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రయాణికులు ఎంత మంది వరకూ ప్రయాణించాలనే దానిపై త్వరలోనే మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేయనుంది.
May 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మే 25 నుంచి విమాన సర్వీసులు ఆరంభం..!!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

