గుంటూరు జిల్లా: జిల్లా కలెక్టర్,ఎస్పీలు సూచనలు మేరకు గుంటూరు,విజయవాడ,నరసరావుపేట తదితర ఏరియాల్లో కరోనా కేసులు నమోదు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ బస్ సర్వీసులు లాక్ డౌన్లో ప్రస్తుతానికి రాకపోకలు నిలుపుదల చేసినట్లు గుంటూరు జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఏస్. టి.వి. రాఘవకుమార్ తెలిపారు. జిల్లాలో 13 బస్ డిపో లు ఉండగా చిలుక లూరిపేట..మాచర్ల డిపో లకు 6 బస్ లు ఈరోజు తిరుగుతున్నాయన్నారు. మాచర్ల లో కరోనా కేసులు నమోదు కావటంతో ఈఏరియాలో కూడా బస్ సర్వీసులు నిలుపుదల పై ఉన్నతాధికారులు మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలో లాక్ డౌన్ ముగిసే వరకు ప్రభుత్వ నిబంధనలు మేరకు ఆర్టీసీ బస్ లు డిపో లకే పరిమితము అవుతాయన్నారు. జిల్లాలో రెడ్ జోన్లు అధికంగా ఉన్నందున కరోనా కేసులు నియంత్రణ కు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు.
May 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: గుంటూరు జిల్లాలో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

