728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 31, 2020

భారత్‌లో 5వేలు దాటిన కరోనా మరణాలు!

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో భారత్‌ విలవిల్లాడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా రికార్డుస్థాయిలో 8380పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు దేశంలో 8వేలకుపైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 182,143కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 5164కి చేరింది. వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 86,984 మంది కోలుకొని డిశ్చార్జి కాగా మరో 89,995మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రపంచంలోనే వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతుండగా మరణాల్లో మాత్రం 13వ స్థానంలో ఉంది. అత్యధిక కొవిడ్‌-19 కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో జర్మనీ 8వ స్థానంలో ఉండగా.. టర్కీ 10వ స్థానంలో ఉంది.

అయితే, దేశంలో లాక్‌డౌన్‌ 4.0 గడువు ముగియడంతో లాక్‌బడౌన్‌ 5.0కి సంబంధించి తాజా మార్గదర్శకాలను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో 5వేలు దాటిన కరోనా మరణాలు! Rating: 5 Reviewed By: NEWS UPDATE