728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

90 శాతం హామీలను ఒక్క ఏడాదిలోనే నెర‌వేర్చిన అరుదైన ప్ర‌భుత్వం మాది: ఎమ్మెల్యే ర‌జిని

చిలకలూరిపేట: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విప్ల‌వాత్మక ప‌రిపాల‌నకు ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బీజం వేశార‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా శ‌నివారం త‌న కార్యాల‌యంలో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప‌రిపాల‌న‌ను క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. గ్రామ స‌చివాల‌యాలు, వాటి విధులు అనిర్వ‌చ‌నీయ‌మ‌ని కొనియాడారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు సులువుగా అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని ప్ర‌శంసించారు. సంక్షేమ‌ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలో, ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో, ఆర్థిక సాయం అందజేయ‌డంలో, రైతుల‌కు సాయంచేయ‌డంలో, విద్య‌, వైద్య రంగాల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంలో.. ఇలా ప్ర‌తి అంశంలో త‌మ ప్ర‌భుత్వం రికార్డులు సృష్టించింద‌ని వెల్ల‌డించారు. దేశ చ‌రిత్ర‌లోనే ఇంత గొప్ప పాల‌న‌ను ఎవ‌రూ చూడ‌లేద‌ని కొనియాడారు. త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంతో దార్శినిక‌త‌తో ఆలోచించి ప‌రిపాల‌న చేస్తున్నార‌ని చెప్పారు. స‌చివాల‌యాలు ప‌రిపాల‌న‌లో పెనుమార్పులు తీసుకొస్తాయ‌న్నారు. అవినీతిలేని, వేగ‌వంత‌మైన ప‌రిపాల‌న ప్ర‌జ‌ల సొంత‌మ‌వుతుంద‌ని కొనియాడారు. రానున్న నాలుగేళ్ల‌లో ఏపీలో ప‌రిపాల‌నా స్వ‌రూప‌మే మారిపోతుంద‌ని, ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో జీవిస్తార‌ని చెప్పారు. ఇంత గొప్ప ప్ర‌భుత్వంలో తాను భాగ‌స్వామిగా ఉండ‌టం త‌న అదృష్ట‌మ‌ని ఆనందం వ్య‌క్తంచేశారు. త‌మ‌ను ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని, ప్ర‌భుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే త‌మ చిత్త‌శుద్ధిని నిరూపించుకున్నామ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 90 శాతం హామీలను ఒక్క ఏడాదిలోనే నెర‌వేర్చిన అరుదైన ప్ర‌భుత్వం మాది: ఎమ్మెల్యే ర‌జిని Rating: 5 Reviewed By: NEWS UPDATE