చిలకలూరిపేట: పట్టణంలో 52 ఎకరాల్లో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల లబ్ధిదారుల జాబితాను మార్చొద్దని, టీడీపీ హయాంలో లబ్ధి పొందిన వారైనా సరే వారి ఇళ్లు వారికి ఇచ్చేయాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ హయాంలో ఇళ్ల జాబితాలో నమోదైన కొంతమంది తమ పేర్లు తాజా జాబితాలో లేవని, తొలగించారని ఎమ్మెల్యే విడదల రజినికి శనివారం ఫిర్యాదుచేశారు. స్పందించిన ఎమ్మెల్యే రజిని శనివారం కమిషనర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో గతంలో నమోదైన లబ్ధిదారుల్లో అర్హులు ఉంటే ఎవరినీ కదిలించొద్దని చెప్పారు. ఎవరి దరఖాస్తును కూడా తిరస్కరించవద్దని తెలిపారు. పార్టీ వివక్ష ఎవరిపై చూపొద్దని నిజంగా లబ్ధిదారుడు అయితే ఇళ్లు ఇచ్చేయాలని స్పష్టంచేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
May 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఆ పార్టీ, ఈ పార్టీ లేదు... అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాల్సిందే: ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

