చిలకలూరిపేట: రైతు కోసం ఎంత సాయం చేసేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట రూరల్ మండలం మానుకొండవారిపాలెం గ్రామంలో శనివారం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నం పెట్టే కర్షకుడి కష్టం విలువ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌హరెడ్డికి మాత్రమే తెలుసునని చెప్పారు. ఎన్నికల సమయంలో తాము అన్నదాతలందరికీ ఐదేళ్లలో రూ.48వేలు ఆర్థిక సాయం రైతు భరోసా పథకం కింద అందజేస్తామని హామీ ఇచ్చామని, వాస్తవానికి అంతకు మించి ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లకు కలిపి రూ.67,500 ఇస్తున్నామని వివరించారు. చెప్పినదాని కంటే కూడా మిన్నగా తాము లబ్ధిని అందజేస్తున్నామని చెప్పారు. వచ్చే ఖరీఫ్ నుంచే రైతులకు ఉచితంగా తొమ్మిది గంటలపాలు కరెంటు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచే నిరంతరాయంగా రైతులకు ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇవ్వబోతున్నామన్నారు. రైతులకు వడ్డీలేని రణాలు, ఉచిత పంటలబీమా, గిట్టుబాటు ధరలు కల్పించడం.. ఇలా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందుకువెళుతున్నామని చెప్పారు. రైతులకు ఎంతో చేస్తున్నామని తెలిపారు. ఇంతటితో ఆగలేదని, ఇదిగో ఈ రోజు మనం ప్రారంభిస్తున్న రైతు భరోసా కేంద్రాలు భారతదేశంలోనే ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. విప్లవాత్మక పరిపాలన దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పడానికి ఈ ఆర్బీ కేంద్రాలే నిలువెత్తు నిదర్శనమన్నారు.
రైతు ఆలయాలుగా ఆర్బీకే కేంద్రాలు...
ఆర్బీ కే కేంద్రాలు రైతు ఆలయాలుగా పనిచేయబోతున్నాయని ఎమ్మెల్యే విడదల రజిని స్పష్టంచేశారు. మన ప్రభుత్వం, మన పాలన గురించి దేశం మొత్తం చర్చించుకోబోతోందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాతో అన్నీ ఇకపై రైతు భరోసా కేంద్రాల ద్వారానే జరగనున్నాయన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు వేదిక కానున్నాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలకు ఒక్కో స్మార్ట్ టీవీ ఉంటుందని, దాని ద్వారా ఉత్పత్తుల ధరలు, పంటల సమాచారం, సాగుపై అవగాహన, శిక్షణ, శాస్త్రవేత్తలతో ముఖాముఖి తదితర కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాల్లో ఈ టీవీల ద్వారా కొనసాగుతాయని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) అందుబాటులో ఉంటారని తెలిపారు. వీఏఏల ద్వారా రైతులు కోరుకునే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు తెప్పించుకోవచ్చని చెప్పారు. ఆర్ బీ కేల్లోని కియోస్క్ ద్వారా రైతులు వారికి కావాల్సిన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వినియోగించుకుని ఆన్‌లైన్‌లో ఆర్డరు పెట్టుకోవచ్చని తెలిపారు. ఇలా ఆర్డరు పెట్టుకున్న వ్యవసాయ ఉత్పాదకాలను 48 నుంచి 78 గంటల్లోగా రైతులు వారి ఇంటికే తెప్పించుకోవచ్చన్నారు. వ్యవసాయ పరికాలను కూడా ఇలానే పొందొచ్చని చెప్పారు. మట్టి నమూనాలు సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపి విశ్లేషణ ఫలితాలను అందించే బాధ్యతను రైతు భరోసా కేంద్రాలే తీసుకుంటాయన్నారు. మార్కెటింగ్, పంట కొనుగోలు, వాతావరణం, చీడపీడల సమాచారాన్ని కూడా ఆర్ బీ కేల్లో తెలియజేస్తారని వెల్లడించారు. రైతు భరోసా కార్డులు కూడా ఇక్కడి నుంచే ఇస్తారని తెలిపారు. వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా తక్కువ అద్దెపై ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయబోతున్నామని చెప్పారు. పశువులకు ప్రాథమిక వైద్యం, నట్టల నివారణ మందు, ట్యాగింగ్ వంటి సేవలు కూడా ఈ కేంద్రం నుంచి ఇవ్వబోతున్నామని, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్, పౌరసరఫరాలు, పాడి అభివృద్ధి, సహకార శాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ఆర్బీకే కేంద్రాలకు వచ్చి వ్యవసాయ సూచనలు అందజేస్తారని వివరించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండల వ్యవసాయ అధికారిణి శ్రీలత, వెటర్నరీ డీడీఏ బాలశంకరరావు, వెటర్నరీ ఏడీఏ పి.శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ రామమ్మోహనరావు, సెరీకల్చరల్ ఆఫీసర్ వీఎన్ శశికళ, ఎంపీడీవో బి.హేమలత, నాదెండ్ల ఏవో ఎ.హరిప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తల్హాఖాన్, గ్రామనాయకులు కల్లి వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.