728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 21, 2020

అమృత్ ప‌థ‌కం ప్ర‌స్తుత ప‌రిస్థితి, ప‌నుల వివ‌రాల‌పై ఎమ్మెల్యే రజిని స‌మీక్ష‌

గుంటూరు జిల్లా: చిల‌క‌లూరిపేట‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అమృత్ ప‌థ‌కం విష‌యంలో ప్ర‌జారోగ్య‌శాఖ అధికారులు అలసత్వంగా ఉంటున్నారంటూ స్థానిక శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. స్థానిక త‌న కార్యాల‌యంలో గురువారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప్ర‌జారోగ్య‌శాఖ‌, మున్సిప‌ల్ అధికారులు, అమృత్ ప‌థ‌కం కాంట్రాక్ట‌ర్ల‌తో క‌లిపి సంయుక్తంగా స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. పనులు ఎందుకు ఆల‌స్యం అవుతున్నాయో కార‌ణం చెప్పాల‌ని ఎమ్మెల్యే తొలుత కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. వారు స్పందిస్తూ ప్ర‌జారోగ్య శాఖ అధికారుల నుంచి త‌మ‌కు స‌హ‌కారం స‌రిగా అంద‌డంలేద‌ని ఫిర్యాదుచేశారు. రోడ్ల ప‌క్క‌గా పైపు లైను వేసేందుకు ఆర్అండ్‌బీ అధికారుల నుంచి అనుమ‌తి ఇప్పించ‌డంలో జాప్యం చోటుచేసుకుంటోంద‌న్నారు. అమృత్ ప‌థ‌కం కోసం చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీకి రూ.5 కోట్ల నిధులు ప్ర‌భుత్వం మంజూరుచేసినా, వాటి విడుద‌ల విష‌యంలో స్థానిక అధికారులు స‌హ‌క‌రించ‌డంలేద‌ని చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ త‌న‌కు ఏ సాకులూ చెప్పొద్ద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అమృత్ ప‌థ‌కం స‌జావుగా సాధ్య‌మైనంత తొంద‌ర‌గా పూర్తి కావాల‌ని స్ప‌ష్టంచేశారు.
నిధుల విడుద‌ల‌లో జాప్యం చేస్తే కుద‌ర‌ని క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీనివాస‌రావుకు కూడా ఎమ్మెల్యే స్ప‌ష్టంగా చెప్పారు. అమృత్ ప‌థ‌కం చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని, ముందు దీని విలువ తెలుసుకోవాల‌ని అధికారుల‌కు హిత‌వు ప‌లికారు. రూ.139.80 కోట్ల మొత్తం విలువ‌లో మున్సిపాలిటీ చెల్లించాల్సిన రూ.83 కోట్ల నిధుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చెల్లించేలా నేను ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు సమకూరుస్తుంటే.. అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం త‌గ‌ద‌ని హెచ్చ‌రించారు.అలానే కాంట్రాక్టర్లు కూడా బిల్లులు సాకు చూపించి పనులు జాప్యం చేయవద్దని అన్నారు.
అమృత్ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందాలి.మ‌రో ఐదారునెల‌ల్లోగా చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌ల‌కు అమృత్ ఫ‌లాలు అందాల్సిందేన‌ని చెప్పారు. ఈ నెలాఖ‌రుకల్లా ప్ర‌భుత్వం మంజూరుచేసిన రూ.కోట్ల నిధులు విడుద‌ల‌య్యేలా చూడాల‌న‌నారు. ఈ నిధులు విడుద‌ల కాగానే కోట‌ప్ప‌కొండ చాన‌ల్ నుంచైనా స‌రే వెనువెంట‌నే ఎంఎస్ పైప్ లైను నిర్మాణం పూర్తిచేయాల‌ని ఆదేశించారు. క‌నీసం అక్క‌డి నుంచైనా పైపు లైను పూర్తిచేసుకుంటే చెరువును నిరంత‌రాయంగా నింపుకోవ‌చ్చ‌ని చెప్పారు. దీనివ‌ల్ల చెరువులు నింపుకోవ‌డానికి ఏటా ఖ‌ర్చు చేస్తున్న  ల‌క్ష‌ల నిధుల‌ను ఆదా చేసుకోవ‌చ్చ‌న్నారు. ట్రాక్ట‌ర్ల ద్వారా నీటి పంపిణీ క‌ష్టాల నుంచి కూడా అధిగ‌మించ‌వ‌చ్చ‌ని చెప్పారు. సాగ‌ర్ కుడికాలువ నుంచి ఎంఎస్‌పైపు లైను నిర్మాణం నిదానంగా చేసుకోవ‌చ్చ‌ని, వెంట‌నే ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అనుస‌రిద్దామ‌ని తెలిపారు. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్ర‌తినిధులు కూడా వెంట‌నే కోట‌ప్ప‌కొండ చాన‌ల్ నుంచి పైపు లైను నిర్మాణం ప‌నులు మొద‌లుపెడ‌తామ‌ని చెప్పారు.
పదిహేను రోజులకు నివేదిక ఇవ్వండి.ప‌నుల పురోగ‌తిపై త‌న‌కు 15 రోజులకు ఒకసారి నివేదిక కావాల‌ని ఎమ్మెల్యే ప్ర‌జారోగ్య శాఖ‌ అధికారుల‌ను ఆదేశించారు. ఆ 15 రోజుల్లో ఏ పనులు చేశారు..? వ‌చ్చే 15 రోజుల్లో చేయాల్సిన ప‌నులు ఏంటి..? అనే వివ‌రాల‌ను ప్ర‌తి వారం త‌నకు ఇవ్వాల‌ని చెప్పారు. తాను మ‌ళ్లీ మ‌ళ్లీ అడ‌గ‌న‌ని, అధికారులు వ‌చ్చి వివ‌రాలు చెప్పాల‌ని ఆదేశించారు. అమృత్ ప‌థకానికి నిధుల స‌మ‌స్య రాకుండా తాను చూసుకుంటాన‌ని, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి డ‌బ్బులు వ‌చ్చేలా చూస్తాన‌ని అన్నారు. అధికారుల కంటే ఎక్కువగా అమృత్ ప‌థ‌కం కోసం తానే శ్ర‌మించాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇక‌పై అధికారులు, కాంట్రాక్ట‌ర్ ఒక్క‌టిగా క‌లిసి ప‌నిచేయాల‌ని ఆదేశించారు. చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌లు చిర‌కాలం గుర్తుంచుకునే అతి పెద్ద మేలు అమృత్ ప‌థ‌క‌మ‌ని, దీన్ని స‌జావుగా పూర్తిచేసి, అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతామ‌ని తెలిపారు. స‌మావేశంలో ఎమ్మెల్యేతోపాటు ప్ర‌జారోగ్య‌శాఖ ఈఈ శ్రీనివాస‌రెడ్డి, డీఈ శ్రీనివాస‌రావు, క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీనివాస‌రావు, మున్సిప‌ల్ డీఈ ర‌హీం, ఏఈ వినోద్‌, కాంట్రాక్ట్ సంస్థ ప్ర‌తినిధులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అమృత్ ప‌థ‌కం ప్ర‌స్తుత ప‌రిస్థితి, ప‌నుల వివ‌రాల‌పై ఎమ్మెల్యే రజిని స‌మీక్ష‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE