చిలకలూరిపేట: పట్టణంలోని 29వవార్డుకు చెందిన 600 ముస్లిం కుటుంబాలకు గురువారం రంజాన్ కానుక ను ఎమ్మెల్యే రజని అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూసుఫ్ అలీ, తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. స్థానిక యార్డు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంచాల్సిందిగా మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ముస్లిం బాలికల రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఆటోనగర్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
May 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నిరుపేద కుటుంబాలకు రంజాన్ కానుక అందజేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

