హార్ట్‌ఫోర్డ్(యూఎస్): ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ వ్యాధి చికిత్సలో కొన్ని కొత్త మందులు సంతృప్తికర ఫలితాలనిస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ల నివారణలో ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, వీటి వాడకం ద్వారా ప్రతికూల ప్రభావాలూ పెద్దగా లేవని తెలిపారు. అయితే వీటి ధర అత్యధికంగా ఉండటం ఒక్కటే సమస్య అని చెప్పారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అదుపునకు ఆస్ట్రా జెనికా కంపెనీ తయారు చేస్తున్న ‘టాగ్రిస్సో’ బాగా పనిచేస్తోందని.. ఆ ఔషధంపై ప్రయోగాలు చేస్తున్న అమెరికాలోని యేల్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ రాయ్ హెర్బ్స్ పేర్కొన్నారు. ఈ మందు నెలరోజుల కోర్సుకు 15 వేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా తలెత్తే ఇతర సమస్యలను మ్యోవాంట్ సైన్సెస్ కంపెనీకి చెందిన ‘రెలుగోలిక్స్’ సమర్థంగా అదుపు చేస్తోందని సియాటిల్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సెలెస్టియా హిగానో తెలిపారు. మెర్క్ అండ్ కంపెనీ వారి ‘కీట్రుడా’ పెద్దపేగు క్యాన్సర్‌ను అదుపు చేస్తున్నట్లు నాష్‌విల్లే క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి డాక్టర్ హోవర్డ్ బరిస్ వెల్లడించారు. ఈయన యూఎస్‌లోని అంకాలజీ సొసైటీ అధ్యక్షుడిగానూ సేవలందిస్తున్నారు.
May 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: క్యాన్సర్లను అరికడుతున్న కొత్త ఔషధాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

