గుంటూరు జిల్లా: ఏడ్లపడు మండలం తిమ్మాపురంలో అన్నదాతలకు వైఎస్సార్ రైతు భరోసా పత్రాల పంపిణీ.
తమది రైతు ప్రభుత్వమని, తాము అధికారంలోకి వచ్చాక మాత్రమే తిరిగి అన్నదాతల మోముల్లో ఆనందం వికసిస్తోందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలులో భాగంగా సంబంధిత పత్రాలను చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని శనివారం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము నెలకొల్పబోతున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు భవిష్యత్తులో వ్యవసాయ ఆలయాలుగా విరజిల్లుతాయని తెలిపారు. సాగుకు కావాల్సిన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు.. అన్ని ఈ కేంద్రాల్లో రైతులకు దొరుకుతాయని చెప్పారు. తక్కువ ధరకు రైతు కొనుగోలు చేసుకోవచ్చని, ప్రభుత్వం ధ్రువీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఇక్కడ దొరుకుతాయని తెలిపారు. మట్టి నమూనాల నుంచి ఎన్నో రకాల పరీక్షలను ఈ రైతు భరోసా కేంద్రాల్లో చేస్తారని తెలిపారు. రైతు పండించిన పంటను కూడా రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేస్తాయన్నారు. వచ్చే ఏడాది వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి మెజారిటీ ప్రాంతాలకు, రబీ నుంచి అన్ని ప్రాంతాలకు 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఈ ఏడాది రైతు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు దక్కాయని చెప్పారు. ప్రభుత్వమే పలు పంటలు కొనుగోలు చేసి రైతుకు అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామనాయకులు వాసు, సాంబశివరావు, జంగా ప్రసన్న, జ్యోతి రత్నబాబు, పాల్, జెస్సిబాబు తదితరులు పాల్గొన్నారు.