గుంటూరు జిల్లా: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రజని.అయ్యో.. ప్రమాద బాధితులంతా మహిళలే. మెరుగైన వైద్యం అందించండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలి. వారి బాధ్యతను మీరే తీసుకోండి. అంటూ చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం గ్రామానికి చెందిన మిర్చి కూలీలు ట్రాక్టర్‌పై పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా.. టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో 23 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో 18 మంది మహిళలే ఉన్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరిని చిలకలూరిపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మహిళా కూలీలను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది ఉండదని, ఇక్కడి వైద్యులు బాగా చూసుకుంటారని బాధితులకు భరోసా ఇచ్చారు. వైద్యుల ద్వారా అందరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ వైద్యులకు ఎమ్మెల్యే చెప్పారు. లాక్డౌన్ ప్రభావం ప్రమాద బాధితులపై పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రజని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

