728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 21, 2020

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రివర్యులు,నారా లోకేష్ లేఖ

ఆంధ్రప్రదేశ్:
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.గ్రామ స్థాయిలోనే పంట ఉత్పత్తుల సేకరణ జరగాలి అని నారా లోకేష్ లేఖ రాశారు.

★ ఆరుగాలం శ్రమించి పంటలను పండించే రైతులు నేడు ఆ పంటలను కొనే నాథుడే లేక అనేక అవస్థలు పడుతున్నారు.

★ ప్రభుత్వ కొనుగోళ్లు అరకొరగా ఉన్నాయి.ప్రభుత్వం చెప్పే లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదు.

★ ఏపీలో అన్ని పంటలు కలిపి 6,17,837 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా.. పండిన పంటలో 10వ వంతు మాత్రమే కొనుగోలు చేశారు.

★ తెలంగాణలో సుమారు రూ.5వేల కోట్లతో పంటలను కొనుగోలు చేయగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు.

★ రాష్ట్రంలో రబీలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా..5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.

★ తెలంగాణలో 22 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

★ కొనుగోలు కేంద్రాలు కూడా అరకొరగా ఉన్నవి. మరోవైపు ధాన్యం, వేరుశనగ, పసుపు, పొగాకు, మొక్కజొన్న, జొన్న, కంది, శనగ ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు.

★ ఉద్యానవన, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

★ వైసీపీ నేతలు దళారుల అవతారం ఎత్తి అక్రమాలకు పాల్పడుతున్నారు.

★ మొక్కజొన్న, నిమ్మ, సపోట, అరటి రైతుల బాధలు వర్ణనాతీతం.

★ గతేడాది మొక్కజొన్న క్వింటాలుకు రూ.2 వేల వరకు రైతుకు దక్కగా .. నేడు  1350 నుంచి రూ.1400కే కొనుగోలు చేస్తున్నారు.

★ నిమ్మకాయలు గతేడాది కేజీ రూ.60 నుంచి 70 ఉండగా.. నేడు రూ.10 నుంచి రూ.12 మాత్రమే దక్కుతోంది.

★ సపోట గతేడాది గంప రూ.1500 ఉండగా.. నేడు రూ.500 కూడా దక్కడం లేదు.

★ అరటి గెల గతేడాది రూ.300 నుంచి రూ.500 ఉండగా.. నేడు కనీసం రూ.100 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు.

★ వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అయినకాడికి అమ్ముకుంటున్నారు.

★ మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయడంలో లేదు.

★ అన్నదాతల బాధలు మీ ప్రభుత్వానికి కనిపించడం లేదా?

★ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుని వారిని మోసం చేస్తుండటం నిజం కాదా?

★ గ్రామస్థాయిలోనే రైతుల పంట ఉత్పత్తులను ఎందుకు కొనుగోలు చేయకూడదు?

★ వాలంటీర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు 20 నుంచి 25 మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నప్పుడు గ్రామస్థాయిలోనే పంటలను కొనుగోలు చేయాలి.

★ లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు తక్షణమే గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల సేకరణ జరగాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రివర్యులు,నారా లోకేష్ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE