గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని,కరోనా లాక్ డౌన్ కాలంలోని విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని గుంటూరు వామపక్ష పార్టీల సిపిఐ, సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక పాత గుంటూరు విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సి.పి.ఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ లక్ష్మీనారాయణ,సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు షేక్.అమీర్ వలి,ఎం.కుమార్ నాయక్, సిపిఐ నగర సమితి సభ్యులు జంగాల చైతన్య, రాగం చంద్రమౌళి, కట్టా శ్రీను, కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు చింతల శ్రీనివాస్, ఎం.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
May 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: గుంటూరు విద్యుత్ కార్యాలయం వద్ద వామపక్షాల ధర్నా
Rating: 5
Reviewed By: NEWS UPDATE

