728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 20, 2020

ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం..కొత్త దరఖాస్తులు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్:
🔹ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం..కొత్త దరఖాస్తులు తీసుకోవాలని సీఎం ఆదేశాలు.
     
🔹కొత్తగా దరఖాస్తులు తీసుకోండి
వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్‌ ఆదేశం..

🔹ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు..

🔹అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు. మరో 15 రోజులు సమయమిచ్చి దరఖాస్తులు తీసుకోవాలని, పరిశీలన అనంతరం గామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఆదేశించారు..

🔹హౌసింగ్‌, పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు, నాడు-నేడు కింద కార్యక్రమాలు, ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, ఉపాధి హామీ, కరోనా నివారణా చర్యలు తదితర అంశాలపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం సమీక్షించారు.

🔹జులై 8న 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మే 6 నుంచి 21 వరకూ జాబితాల ప్రదర్శించాలని, ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పరిశీలించి జూన్‌ ఏడులోగా తుదిజాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు.

🔹ఈ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే, చేయాలన్నారు.
పక్షపాతం లేకుండా ఈ ప్రక్రియ సాగాలన్నారు. రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బికె)పై అవగాహన కల్పించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. మే 30 నుంచి ఆర్‌బికెలు వస్తాయన్నారు. మరో ఏడాదిలోగా జనతా బజార్‌లుకూడా అందుబాటులో ఉంటాయన్నారు. . మత్స్యకార భరోసా, రైతు భరోసా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు.

🔹రైతులకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వచ్చే అక్టోబరు నాటికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రెవిన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను త్వరలోనే నియమిస్తున్నట్లు తెలిపారు.. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, రాజ్యసభ్య సభ్యుడు వీపీఆర్‌, సిఎస్‌ నీలం సహాని, డిజిపి గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం..కొత్త దరఖాస్తులు తీసుకోవాలని సీఎం ఆదేశాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE