లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఫిబ్రవరి నెలలో వచ్చినంత కరెంటు బిల్లులనే వసూలు చేయాలి. లాక్డౌన్ కాలంలో ప్రజల ఆదాయాలు అడుగంటి అవస్థలు పడుతున్న తరుణంలో వేలాది రూపాయల బిల్లుల భారం వేయడం తగదు’’ అని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. ‘‘బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడానికి కేంద్రం పలు చర్యలు ప్రకటించింది.
అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదారంగా వ్యవహరించాలి. పెంచిన విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి’’ అని ఈ సమావేశం డిమాండ్ చేసింది. కరోనా లాక్డౌన్ కాలంలో ప్రజల నుంచి స్వాధీనం చేసుకొన్న వాహనాలను తిరిగి ఇచ్చేయాలని కోరింది. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖ, గుంటూరు నగరాల్లో ప్రభుత్వ ఆస్తుల విక్రయ ప్రతిపాదన వెంటనే విరమించాలని విజ్ఞప్తి చేసింది. వలస కార్మికుల కోసం కేంద్రం కనీసం ప్రత్యేక రైళ్లను వేసి కొంత ఊరటనిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మాత్రం చొరవ కూడా లేదని విమర్శించింది.

