చిలకలూరిపేట:
1️⃣చిలకలూరిపేట పట్టణంలో నడి బొడ్డున వ్యాపారం కూడలికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకటంతో పాజిటివ్ కేసులు పట్టణంలో ఒకటొకటిగా పెరుగుతూ వచ్చాయి.
2️⃣మొదటగా శివాలయం వీధి లో కరోనా వైరస్ సోకి ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో కళామందిర్ థియేటర్ పరిసరప్రాంతాలు అయిన చలివేంద్రం బజార్, మార్కెట్ ప్రాంతాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూసివేశారు.
3️⃣జూన్ మూడవ తేదీన లాక్ డౌన్ నిబంధనలు చిలకలూరిపేట లో ఎత్తివేస్తారని అనుకుంటున్న సమయంలో వ్యాపారులకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన చిన్నపీరుసాహెబ్ వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మరలా ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మార్కెట్, కళామందిర్ సెంటర్, చలివేంద్ర బజార్లను పూర్తిగా మూసివేశారు.
4️⃣అలానే ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్క వీధి రజక వీధిలో మరో మహిళకు పాజిటివ్ నమోదుకావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల అయినా ప్రభుత్వ కార్యాలయం సబ్ రిజిస్టర్ ఆఫీస్, చౌత్రాసెంటర్, హీరో షోరూం వరకు ఆ ప్రాంతం మొత్తం మూసివేశారు.
5️⃣చిలకలూరిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న వ్యాపార కూడలి కళామందిర్ థియేటర్, మార్కెట్ రోడ్డు, చలివేంద్రం బజారు, బోస్ బజార్,మద్ది మల్లయ్య వీధి కార్యాలయం బజార్లు మొత్తం ఈ రెండు పాజిటివ్ కేసులు నమోదు కావటంతో మరలా మూసివేయడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
6️⃣కాగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు బఫర్ జోన్లలో నిత్యావసర షాపులు తెరుసుకోవచ్చని సిఐ సూర్యనారాయణ తెలియజేశారు.
7️⃣అయినప్పటికీ ఎక్కడికక్కడ షాపులు మూతపడటంతో వ్యాపారులు అందరూ తమకు కావాల్సిన సరకు వాహనాల ద్వారా రాకపోవడంతో జనం ఆ ప్రాంతానికి నిత్యావసరాలు కొనటానికి రాకపోవడంతో పట్టణంలోని బఫర్ జోన్ కాని ప్రాంతమైన సుబ్బయ్య తోట పరిసర ప్రాంతాల్లో షాపులు అద్దెకు తీసుకోవటం లేదా తమ యొక్క వ్యాపారాలను తమ ఇళ్ళల్లోనే చేసుకోవటం జరుగుతుంది.
8️⃣చిలకలూరిపేట పట్టణంలో ఇప్పుడు కళామందిర్ పక్క రోడ్డు నుండి కె.బీ రోడ్డు నుండి జాతీయ రహదారి మీదుగా విజయ భాస్కర్ సెంటర్ వరకు మాత్రమే దారి తెరిచి ఉంది.
9️⃣కాగా RVS హై స్కూల్ నుండి సుబ్బయ్య తోట పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అడ్డంకులు లేవు.
🔹ఏదేమైనప్పటికీ గత రెండు రోజుల క్రితం పట్టణంలో సుమారు 217 మంది కి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను పట్టణ రజక కాలనీలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్ లో నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల రిజల్ట్ వస్తేగానీ పట్టణం లో ఎన్ని కేసులు పెరుగుతాయోనని పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
🔹అయితే కొసమెరుపేమిటంటే ఇంకా కేసులు పెరిగితే చిలకలూరిపేట పట్టణ ప్రాంతం మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కరోనా కేసులు ఇంకా పెరిగితే జిల్లా ఉన్నతాధికారులు పట్టణాన్ని రెండు మూడు రోజుల్లో రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది