చిలకలూరిపేట: గుంటూరు శివారు నల్లపాడుకు చెందిన రోజు వారీ కూలీలు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినితో ఆనందం పంచుకున్నారు. నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేను ఆదివారం జాన్‌సైదా, ఆదినారాయణ, రాముడు, పుటారావు అనే రోజు వారీ కూలీలు యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజల కోసం ఎంతో చేస్తున్న మీకు తమ చేతనైన సాయంగా నిలువెత్తు ఫొటోలను తయారుచేయించామని చెప్పారు. మీ స్ఫూర్తితో తాము కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మీలాంటి వారి సహకారం, ప్రోత్సాహం వల్లనే పేదలకు చేతనైన సాయం చేయగలుగుతున్నానని చెప్పారు. ఆపద సమయంలో ఎప్పటికి తన వంతు చేయూత అందిస్తూనే ఉంటానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విడదల రజిని నిలువెత్తు చిత్రపటాన్ని కూలీలు ఆమెకు అందజేశారు. వెంటనే ఎమ్మెల్యే వారిని పక్కనే ఉన్న కొబ్బరిబోండాల బండి వద్దకు తీసుకెళ్లి.. అందరికీ కొబ్బరి నీళ్లు తాగించారు. ఎర్రటి ఎండలో ఇంతదూరం వచ్చి తనను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
May 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఎమ్మెల్యే రజిని చిత్రపటాన్ని ఎమ్మెల్యే రజిని కి అందజేసిన నల్లపాడు చెందిన కూలీలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

