తిరుపతి:
🔹ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది.
🔹ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు.
🔹జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి.
🔹దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
🔹అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
🔹నిర్దేశిత గడువు నాటికి కొన్ని ఆంక్షలతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకకు అనుమతించనుంది.
దేవాలయాల దర్శనానికి అనుమతి..
🔹సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5 అమలులోకి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. భారీగా సడలింపులనూ ప్రకటించింది.
🔹ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారా ఇతర ప్రార్థనా మందిరాలను జూన్ 8వ తేదీ నుంచి భక్తుల కోసం తెరచుకోవడానికి అనుమతిని ఇచ్చింది.
🔹ఫలితంగా- అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు.