హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తనయుడు మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కృష్ట పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మహేశ్ ఆదివారం ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఇందులో మహేశ్ మాస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో మహేశ్ సరికొత్తగా కనిపించారు. ‘హ్యాట్రిక్ కోసం బ్లాక్‌బస్టర్ ఆరంభం’ అని ఆయన పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
May 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సర్కారు వారి పాట.. మహేశ్ లుక్ అదుర్స్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

