728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2020

కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్‌!

దిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడ్డ తరువాత  24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే, కరోనా మరణాల్లో భారత్‌, చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4634 కొవిడ్‌ మరణాలు సంభవించగా భారత్‌లో ఈ సంఖ్య 4706గా ఉండటం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. అంతేకాకుండా కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్‌ 9వ స్థానానికి ఎగబాకింది. లక్షా 82వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా, లక్షా 60వేల కేసులతో టర్కీ 10స్థానంలో కొనసాగుతోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్‌! Rating: 5 Reviewed By: NEWS UPDATE